For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

U కాదు V కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థ ఇలా కోలుకుంటుంది

|

భారత ఆర్థిక వ్యవస్థ V లేదా U షేప్ రికవరీని చూడకపోవచ్చునని, నైక్ స్వూష్ రికవరీ ఉండవచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ అబీక్ బారో అన్నారు. కరోనా కారణంగా, ఆ తర్వాత లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తోన్న విషయం తెలిసిందే. 2022 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అబీక్ చెప్పారు.

'అమెరికన్' మ్యాజిక్ ఉందిగా... ఇవి మనల్నేం చేయలేవ్: కరోనాపై వారెన్ బఫెట్'అమెరికన్' మ్యాజిక్ ఉందిగా... ఇవి మనల్నేం చేయలేవ్: కరోనాపై వారెన్ బఫెట్

లాక్ డౌన్ లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్‌ను తొలుత ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రకటించారు. దానిని రెండోసారి మే 3వ తేదీ వరకు, ఆ తర్వాత మే 17కు పొడిగించారు. అయితే మరింత ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడ్డారు.

ndia will have a Nike Swoosh recovery

మనం కఠినమైన లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని, ఆర్థిక ప్యాకేజీ చిన్నదేనని, దేశంలోని వారందరికీ పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించేలా మన వద్ద ఆర్థిక పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశమని, కాబట్టి ఇలాంటి పూర్తి ప్రయోజనాలు బదలీలు సాధ్యం కాదన్నారు. అలాంటి సమయంలో మన వద్ద ఆర్థిక కార్యకలాపాలు సాధ్యమైనంత త్వరగా తెరుచుకోవాలన్నారు. లాక్ డౌన్ తర్వాత కోలుకోవడం చాలా క్లిష్టమైనదేనని చెప్పారు.

English summary

U కాదు V కాదు.. భారత్ ఆర్థిక వ్యవస్థ ఇలా కోలుకుంటుంది | ndia will have a Nike Swoosh recovery

భారత ఆర్థిక వ్యవస్థ V లేదా U షేప్ రికవరీని చూడకపోవచ్చునని, నైక్ స్వూష్ రికవరీ ఉండవచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ అబీక్ బారో అన్నారు. కరోనా కారణంగా, ఆ తర్వాత లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తోన్న విషయం తెలిసిందే. 2022 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అబీక్ చెప్పారు.లాక్ డౌన్ లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్‌ను తొలుత ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రకటించారు. దానిని రెండోసారి మే 3వ తేదీ వరకు, ఆ తర్వాత మే 17కు పొడిగించారు. అయితే మరింత ఉద్దీపన ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడ్డారు.
Story first published: Sunday, May 3, 2020, 20:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X