టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరన్ అపాయింట్
టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ మరోసారి ఎన్నికయ్యారు. మరో అయిదేళ్ల పాటు ఆయన కంపెనీ బాధ్యతల్లో ఉంటారు. వచ్చే అయిదేళ్లకు గాను చంద్రశేఖన్ మరోసారి ఎంపికయ్యారని, ఏకగ్రీవంగా ఆయనను ఎంపిక చేసినట్లు టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రతన్ టాటా ఉన్నారు. చంద్రశేఖరన్ నేతృత్వంలోని గ్రూప్ పురోగతి, పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని మరో అయిదేళ్లకు పొడిగించినట్లు తెలిపారు.
తన పునర్నియామకంపై చంద్రశేఖరన్ స్పందించారు. గత అయిదేళ్లుగా టాటా గ్రూప్‌నకు నాయకత్వం వహించే అవకాశం రావడం ఓ విశేషమని, మరో అయిదేళ్ల పాటు కంపెనీని నడిపించే బాధ్యతలు రావడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని చంద్రశేఖరన్ అన్నారు.

చంద్రశేఖరన్ అక్టోబర్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరారు. జనవరి 2017లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించబడ్డారు. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ దాదాపు 103 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. మన కరెన్సీలో ఇది రూ.7.7 లక్షల కోట్లు.