For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటా భారీగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. ప్రపంచంలోని 46 నగరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ స్థానాలు..

|

House prices: సొంతిల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఇప్పటికే అభివృద్ధి చెందిన, చెందుతున్న నగరాలు, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే అదేమీ అంత తేలిక కాదు. డెవలప్‌మెంట్‌ కి తగ్గట్లుగానే ధరలు సైతం మోత మోగిపోతూ ఉంటాయి. ఈ కోణంలో చూస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబై.. ప్రపంచంలోని టాప్ 10 నగరాల్లో చోటు దక్కించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా 46 నగరాల్లోని హై ఎండ్ నివాస ప్రాపర్టీల వార్షిక ధరల పెరుగుదల పరంగా 5.5 శాతంతో ముంబై ఆరవ స్థానంలో నిలిచింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. 'ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ Q1 2023'గా పిలవబడే ఈ లిస్టులో.. 2023 జనవరి-మార్చిలో ముంబై, బెంగళూరు మరియు న్యూఢిల్లీ సగటు వార్షిక ధరల్లో మంచి పెరుగుదలను నమోదు చేశాయని పేర్కొంది.

Mumbai stood in 6th place among 46 global cities annual housing price growth

"హై-ఎండ్ లేదా ప్రైమ్ ప్రాపర్టీలలో వార్షిక వృద్ధి ఆధారంగా గతేడాది Q1లో 38వ ర్యాంక్ నుంచి ఈ దఫా Q1 నాటికి ఆరవ ర్యాంకుకు ఎగబాకింది" అని కన్సల్టెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలో బెంగళూరు మరియు న్యూఢిల్లీ కూడా ఇండెక్స్ ర్యాంకింగ్‌లో 37, 39 ర్యాంకుల్లో ఉండగా.. ఇప్పుడు వరుసగా 16 మరియు 22వ స్థానాలు సాధించాయి.

ముంబైలో సగటు ధరల పెరుగుదల సంవత్సరానికి 5.5 శాతం(YoY)గా నమోదైంది. 2022 Q1తో పోలిస్తే బెంగళూరులో ఇది 3 మరియు న్యూఢిల్లీలో 1.2 శాతం మాత్రమేనని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అయితే ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ విలువలో 44.2% పెరుగుదలతో దుబాయ్ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

"2022లో ప్రపంచాభివృద్ధి మరియు ద్రవ్యోల్బణం గురించి అంతటా ఆందోళనలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన పనితీరు కనబరిచింది" అని నైట్ ఫ్రాంక్ ఇండియా CMD శిశిర్ బైజాల్ తెలిపారు. ఓ వైపు ద్రవ్యోల్బణ వాతావరణం ఉన్నా, దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో నిరంతరం డిమాండ్‌లో ఊపందుకుంటున్నట్లు చెప్పారు. గత ఏడాదిగా గృహ రుణాల రేట్లు బాగా పెరిగాయని గుర్తు చేశారు.

English summary

ఏటా భారీగా పెరుగుతున్న ఇళ్ల ధరలు.. ప్రపంచంలోని 46 నగరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ స్థానాలు.. | Mumbai stood in 6th place among 46 global cities annual housing price growth

Mumbai stood in 6th place among 46 global cities annual housing price growth
Story first published: Tuesday, May 16, 2023, 7:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X