మనీలాండరింగ్ కేసులో ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కు ఊరట లభించింది . మనీలాండరింగ్ కేసులో ముంబై కోర్టు శుక్రవారం ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఈఓ చందా కొచ్చర్‌కు ₹ 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం వదిలి వెళ్లొద్దు అని ఆదేశించింది .

ముంబై నగరంలోని సెషన్స్ కోర్టులో హాజరైన చందా కొచ్చర్
నిబంధనలకు విరుద్ధంగా వీడియోకాన్ రుణాల కేసులో నిందితురాలైన ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఎండి చందా కొచ్చర్ శుక్రవారం ముంబై నగరంలోని సెషన్స్ కోర్టులో హాజరయ్యారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎ ఎ నంద్‌గోంకరాండ్ ముందు చందా కొచ్చర్ హాజరయ్యారు. 2009- 2011 సంవత్సరాలలో వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ దూత్, వీడియోకాన్ గ్రూప్ కంపెనీకి సంబంధించి 1875 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసిన వ్యవహారంలో చందా కొచ్చర్ , ఆమె భర్త దీపక్ కొచ్చర్ అక్రమాలకు పాల్పడ్డారని వీరిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2019లో కేసు నమోదు చేసింది.

విదేఒకాన్ రుణాల కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న చందా కొచ్చర్
ఇక సిబిఐ దర్యాప్తులో వీడియోకాన్ కు మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో చందాకొచ్చర్ ప్రమేయం ఉందని తేలింది. చందా కొచ్చర్ పదవిని దుర్వినియోగం చేశారని, క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చందాకొచ్చర్ ను కోర్టు విచారించింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్ , వేణుగోపాల్ ధూత్ మరియు ఇతరులపై సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ క్రిమినల్ కేసు నమోదు చేసిన తరువాత 2020 సెప్టెంబర్‌లో దీపక్ కొచ్చర్‌ను ఈడీ అరెస్టు చేసింది.

వీడియోకాన్ కేసులో న్యుపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ కు నగదు బదిలీ
చందా కొచ్చర్ నేతృత్వంలోని ఐసిఐసిఐ బ్యాంక్ కమిటీ వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు మంజూరు చేసిన రూ .300 కోట్లలో 64 కోట్ల రూపాయలను వీడియోకాన్ ఇండస్ట్రీస్ న్యుపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పిఎల్) కు సెప్టెంబర్‌లో బదిలీ చేసినట్లు ఈడీ ఆరోపించింది. 2009లో రుణం పంపిణీ చేసిన ఒక రోజు తరువాత ఎన్‌ఆర్‌పిఎల్‌ను ఇంతకు ముందు న్యుపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఎల్) అని పిలిచేవారు, దీనిని దీపక్ కొచ్చర్ సొంతం చేసుకున్నారని ఈడీ తెలిపింది.

చందా కొచ్చర్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకుండా ఆదేశాలు
ఇదే కేసుకు సంబంధించి గత ఏడాది సెప్టెంబర్‌లో భర్త దీపక్ కొచ్చర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే . చందా కొచ్చర్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకుండా ఆదేశించింది . కోర్టు అనుమతి లేకుండా ఆమె దేశం విడిచి వెళ్ళలేరు. వీడియోకాన్ కేసుతో పాటు ,చందా కొచ్చర్ పదవీకాలంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చిన రెండు ఇతర రుణాలను కూడా ఈడీ పరిశీలిస్తోంది . గుజరాత్ కు చెందిన ఔషధ సంస్థ స్టెర్లింగ్ బయోటెక్ మరియు భూషణ్ స్టీల్ గ్రూప్ కు ఇచ్చిన రుణాలపై కూడా మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతుంది .
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications