For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఒక్క షేర్‌లో రూ.లక్ష పెట్టుబడి: 48 లక్షల రూపాయలు లాభం

|

ముంబై: స్టాక్ మార్కెట్.. షేర్ల కొనుగోళ్లు, అమ్మకాల మీద మంచి అవగాహన ఉండే వారికి అద్భుతమైన రిటర్నులను అందిస్తుంది. షేర్ బజార్‌లో ఎన్నో కంపెనీలకు సంబంధించిన షేర్లు రిటర్నులను షేర్ హోల్డర్లకు ఇస్తోన్నాయి. షేర్లు కొనాలనే ఆలోచన రాగానే కొన్ని బడా కంపెనీల పేర్లు మనకు గుర్తుకొస్తుంటాయి. బ్యాంకింగ్ సెక్టార్‌కు సంబంధించిన షేర్లు కూడా మంచి లాభాలను ఆర్జించిపెట్టేవే. వాటిల్లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రారంభంలో పెద్ద మొత్తాలను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

బిగ్ కంపెనీల్లో..

బిగ్ కంపెనీల్లో..

అలాంటి బిగ్ షాట్ కంపెనీలే కాకుండా.. కొన్ని చిన్న తరహా సంస్థలకు సంబంధించిన షేర్లు కూడా ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను తెచ్చిపెట్టేవే. వాటి గురించి సాధారణ ఇన్వెస్టర్లకు తెలిసే సమాచారం కొంతవరకు మాత్రమే ఉంటుంది. పైగా వాటి పేర్లు, పనితీరు గురించి పెద్దగా మనకు తెలియకపోవడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి కొంత వెనుకాడుతుంటాం. పెట్టే పెట్టుబడి ఏదో కాస్త పేరున్న కంపెనీల్లో పెడితే లాభం రాకపోయినప్పటికీ.. నష్టం మాత్రం రాదనే అభిప్రాయం సాధారణంగా నెలకొని ఉంటుంది.

 పెట్టుబడులు భారీగా.. రిటర్న్స్‌ అదే స్థాయిలో

పెట్టుబడులు భారీగా.. రిటర్న్స్‌ అదే స్థాయిలో

టాటా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదాని, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు సంబంధించిన షేర్లు దీర్ఘకాలానికి మంచి లాభాలను అందిస్తుంటాయి. ప్రారంభంలో భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే రిటర్న్స్ ఆశించవచ్చనడంలో సందేహాలు అక్కర్లేదు. మొదట్లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పటికీ.. దానికి తగ్గట్టుగా లక్షల రూపాయల మేర లాభాన్ని అందిస్తుంటాయి పేరున్న కంపెనీలు.

టాటా ఎలెక్సీ..

టాటా ఎలెక్సీ..

అలాంటి సంస్థల జాబితాలో టాప్ ఉంది టాటా గ్రూప్. తమ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన వారి పంట పండించింది. ఇదే గ్రూప్‌కు చెందిన టాటా ఎలిక్సి (Tata Elxsi) కళ్లు చెదిరే ఆదాయాన్ని అర్జించి పెట్టింది షేర్ హోల్డర్లకు. వారిని లక్షాధికారులను చేసింది. ప్రారంభంలో లక్ష రూపాయల మేర ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వారికి ఏకంగా 48 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెట్టిందీ షేర్. 10 సంవత్సరాల వ్యవధిలో 48 రెట్లు పెరిగింది ఈ షేర్ వేల్యూ.

టాటా గ్రూప్.. ఘనత

టాటా గ్రూప్.. ఘనత

టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటికి మించిన ఒకటి సంస్థలు ఉన్నాయి. దేశ నిర్మాణంలో టాటా సంస్థలు పోషించిన పాత్రను ఏ మాత్రం విస్మరించలేనివి. విమానయాన రంగం మొదలుకుని ఆటో మొబైల్ సెక్టార్, హోమ్ అప్లయన్సెస్ వరకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది టాటా గ్రూప్. షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు బెస్ట్ ఛాయిస్‌గా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అందులో పెట్టుబడులు పెడితే.. పెరగడమే తప్ప తరగదనే అభిప్రాయం ఉంది.

 ఏడాదిలో

ఏడాదిలో

ఈ గ్రూప్ కంపెనీల్లో టాటా ఎలెక్సి షేర్ ధర భారీగా పెరుగుతూ వస్తోంది. సరిగ్గా 10 సంవత్సరాల కిందట ఈ షేర్ వేల్యూ ఒక్కింటికి 105 రూపాయలు మాత్రమే. ఇప్పుడు దాని ధర 5,000 రూపాయలకు చేరింది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ షేర్ ధర రూ. 4,928.75 పైసల వద్ద ముగిసింది. ఇలా 10 సంవత్సరాల వ్యవధిలో షేర్ హోల్డర్లకు తాము పెట్టిన పెట్టుబడికి 48 రెట్ల ఆదాయాన్ని అందించిందీ కంపెనీ షేర్. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 163 శాతం రిటర్న్స్ ఇచ్చింది ఈ షేర్ మాత్రమే.

ఎన్ఎస్ఈలో..

ఎన్ఎస్ఈలో..

ఈ ఏడాది ప్రారంభంలో టాటా ఎలెక్సి షేర్ ధర 1,885 రూపాయలుగా ఉండేది. తాజాగా ఈ సంఖ్య 4,928.75కు చేరింది. ఏప్రిల్ 1వ తేదీన ఆరంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ షేర్ ధర రూ.2,670.30 పైసల మేర పెరుగుదల చోటు చేసుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో టాటా ఎలెక్సి ఒక్కో షేర్ రూ. 4,928.75 పైసల వద్ద ముగిసింది. కనిష్ఠంగా 4,851 రూపాయలుగా నమోదైంది. గరిష్ఠంగా 4,955 రూపాయలుగా చేరింది. మళ్లీ స్వల్పంగా క్షీణించి.. 4,928.75 పైసల వద్ద ముగిసింది. 52 వారాల్లో అత్యల్పంగా 1,160 రూపాయలు, అత్యధికంగా రూ.5,015.85 పైసలుగా రికార్డయింది ఒక్కో టాటా ఎలెక్సి షేర్ ప్రైస్.

బీఎస్ఈలో

బీఎస్ఈలో

బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో టాటా ఎలెక్సి ఒక్కో షేర్ రూ. 4,940.00 పైసల వద్ద ముగిసింది. కనిష్ఠంగా 4,851.80 రూపాయలుగా నమోదైంది. గరిష్ఠంగా రూ.4,954.95 పైసలుగా రికార్డయింది. మళ్లీ స్వల్పంగా క్షీణించి.. 4,928.75 పైసల వద్ద ముగిసింది. 52 వారాల్లో అత్యల్పంగా 1,153 రూపాయలు, అత్యధికంగా రూ.5,015.00 పైసలుగా రికార్డయింది ఒక్కో టాటా ఎలెక్సి షేర్ ప్రైస్.

తక్కవ ఇన్వెస్‌మెంట్‌తోనూ..

తక్కవ ఇన్వెస్‌మెంట్‌తోనూ..

తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో పెద్ద ఎత్తున లాభాలను తెచ్చిపెట్టే చిన్న స్తాయి కంపెనీలకు చెందిన షేర్లు చాలా ఉన్నాయి. చిన్న కంపెనీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తాయనేది స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. కొన్ని చిన్న కంపెనీలు కూడా షేర్ హోల్డర్లకు భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. స్టీల్ స్ట్రిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. నిపుణులు ఎంపిక చేసిన ఈ నాలుగింట్లో మొదటి స్థానంలో ఉందీ కంపెనీ. స్టీల్ స్ట్రిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీ లాభాలను చవి చూశారు. మూడు నెలల్లో వారు పెట్టిన పెట్టుబడులపై 635 శాతం రాబడిని పొందారు

 భారీ రిటర్న్స్ ఇచ్చినవాటిల్లో..

భారీ రిటర్న్స్ ఇచ్చినవాటిల్లో..

ఆదిత్య విజన్.. ఈ కంపెనీ షేర్లు కూడా ఇన్వెస్టర్ల పెట్టుబడులను డబుల్ చేశాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 920 కోట్ల రూపాయలు. మూడేళ్లుగా ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు సుమారు 1150 శాతం మేర రిటర్నులను అందజేశాయి. 1999లో షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ అయినప్పుడు దీని షేరు ఒక్కింటికి 15 రూపాయల వద్ద అలాట్ అయింది. దీనికోసం లక్షా 20 వేల రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అదే స్థాయిలో రాబడి ఉంటుందనేది నిపుణుల మాట.

English summary

ఆ ఒక్క షేర్‌లో రూ.లక్ష పెట్టుబడి: 48 లక్షల రూపాయలు లాభం | Multibagger: This Tata Elxsi Ltd stock turns Rs 1 lakh investment into Rs 48 lakh in 10 years

Tata Elxsi shares price has risen from Rs 104.68 to Rs 4,917 at NSE, logging around 47 times rise in this period.
Story first published: Saturday, September 11, 2021, 11:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X