For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా దెబ్బతో అంబానీకి రోజుకు రూ.2,200 కోట్ల నష్టం, 2 నెలల్లో రూ.1.44 లక్షల కోట్లు ఆవిరి

|

కరోనా మహమ్మారి కుబేరుల ఆస్తులను ఆవిరి చేసింది. మొన్నటి వరకు ఆసియా ధనికుడు ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితమే రెండో స్థానానికి పడిపోయారు. ఈ రెండు నెలల్లో అతని ఆస్తులు భారీగా తగ్గిపోయాయి. ఈ వైరస్ వల్ల మార్కెట్లు కుప్పకూలడం, వ్యాపారాలు నష్టపోతున్న విషయం తెలిసిందే. దీంతో ముఖేష్ అంబానీయే కాదు దేశ, అంతర్జాతీయ కుబేరుల ఆస్తులు భారీగా ఆవిరయ్యాయి.

70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం..మోడీకి రఘురాం రాజన్ కీలక సూచన70 ఏళ్లలోనే అతిపెద్ద సంక్షోభం..మోడీకి రఘురాం రాజన్ కీలక సూచన

48 బిలియన్ డాలర్లకు పడిపోయిన అంబానీ ఆస్తులు

48 బిలియన్ డాలర్లకు పడిపోయిన అంబానీ ఆస్తులు

అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద, కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ల పతనం కావడంతో గణనీయంగా తగ్గింది. కేవలం రెండు నెలల వ్యవధిలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 35 శాతం పడిపోయాయి. దీంతో అంబానీ సంపద విలువ 28 శాతం తగ్గి మార్చి 31వ తేదీ నాటికి 48 బిలియన్ డాలర్లకు తగ్గింది.

అంబానీకి రోజుకు 300 మిలియన్ డాలర్ల నష్టం

అంబానీకి రోజుకు 300 మిలియన్ డాలర్ల నష్టం

ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖేష్ నికర విలువ 19 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.44 లక్షల కోట్లు) తగ్గినట్లు హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది. అంబానీ రోజుకు సగటున 300 మిలియన్ల డాలర్లు (రోజుకు రూ.2,200 కోట్లు) కోల్పోయారు. దీంతో అంతర్జాతీయంగా కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ ఎనిమిది స్థానాలు తగ్గి పదిహేడవ స్థానానికి వచ్చారు.

అదానీ, శివ్‌నాడర్, కొటక్ ఆస్తులు కూడా తగ్గాయి

అదానీ, శివ్‌నాడర్, కొటక్ ఆస్తులు కూడా తగ్గాయి

ఈ రెండు నెలల కాలంలోనే అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర అసుతులు 37 శాతం (6 బిలియన్ డాలర్లు) తగ్గింది. HCL టెక్నాలజీస్ శివ్ నాడార్ సంపద 26 శాతం (5 బిలియన్ డాలర్లు), కోటక్ మహీంద్రా బ్యాంకు అధినేత ఉదయ్ కోటక్ సంపద 28 శాతం (4 బిలియన్ డాలర్లు) తగ్గిందని హరూన్ నివేదిక తెలిపింది.

ప్రపంచంలో భారీగా దెబ్బతిన్నది బెర్నార్డ్ అర్నాల్ట్

ప్రపంచంలో భారీగా దెబ్బతిన్నది బెర్నార్డ్ అర్నాల్ట్

ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ఎక్కువ సంపద దక్కింది ఫ్రాన్స్ కుబేరుడు బెర్నార్డ్ అర్నాల్ట్. అతని సంపద 28 శాతం (30 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో 77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత ప్రపంచంలో భారీగా ఆస్తులు తగ్గింది ముఖేష్ అంబానీకే. ఆస్తులు తగ్గినవారిలో ఈయన రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ టాప్ 100 బిలియనీర్ల జాబితా నుండి ముఖేష్ అంబానీ మినహా అందరూ గల్లంతయ్యారు.

బిలియనీర్ స్థానం కోల్పోయిన ఓయో రామ్స్ చీఫ్

బిలియనీర్ స్థానం కోల్పోయిన ఓయో రామ్స్ చీఫ్

స్టాక్‌ మార్కెట్ల పతనం, రూపాయి విలువ క్షీణించడం భారత పారిశ్రామికవేత్తల సంపదపై ప్రభావం చూపించినట్టు హరూన్ పేర్కొంది. ఓయో రూమ్స్ ప్లాట్‌ఫాం చీఫ్ రితేష్ అగర్వాల్ బిలియనీర్ స్థానాన్ని కోల్పోయినట్టు తెలిపింది.

చెక్కు చెదరని బెజోస్ స్థానం

చెక్కు చెదరని బెజోస్ స్థానం

ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ జెఫ్ బెజోస్ స్థానం చెక్కు చెదరలేదు. 131 బిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఈ రెండు నెలల్లో బెజోస్ సంపద కేవలం 9 శాతమే తగ్గింది. బిల్‌గేట్స్ 91 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

English summary

కరోనా దెబ్బతో అంబానీకి రోజుకు రూ.2,200 కోట్ల నష్టం, 2 నెలల్లో రూ.1.44 లక్షల కోట్లు ఆవిరి | Mukesh Ambani's net worth drops 28% to $48 billion in 2 months

The net worth of India's richest man Mukesh Ambani dropped 28 per cent or $300 million a day for two months to $48 billion as on March 31 due to the massive correction in stock markets, a report said on Monday.
Story first published: Tuesday, April 7, 2020, 7:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X