For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం.. ప్యామిలీ కౌన్సిల్: వారసులకు సమాన బాధ్యతలు?

|

ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలకనిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆంగ్లమీడియాలో వార్తలు వచ్చాయి. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా అగ్రస్థానానికి తీసుకు వెళ్లారు. ఇప్పుడు తన వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారట. ఇందులో భాగంగా ప్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారని వ్యాపారవర్గాల్లో చర్చ సాగుతోందని తెలుస్తోంది.

<strong>మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌తో టిక్‌టాక్ చర్చలు</strong>మైక్రోసాఫ్ట్ ఆసక్తి.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌తో టిక్‌టాక్ చర్చలు

ఆకాష్, ఇషా, అనంత్‌లకు సమాన ప్రాతినిథ్యం కల్పించేలా..

ఆకాష్, ఇషా, అనంత్‌లకు సమాన ప్రాతినిథ్యం కల్పించేలా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13.50 లక్షలకు కోట్లకు పైగా ఉంది. RIL బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న ఆకాష్, ఇషా, అనంత్ సహా కుటుంబ సభ్యులందరికీ సమాన ప్రాతినిథ్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్యామిలీ కౌన్సిల్ అందరికీ సమాన ప్రాతినిథ్యం కల్పిస్తుంది. ఈ కుటుంబంలోని పెద్దలు, ముగ్గురు పిల్లలు, సలహాదారులు, సలహాదారులుగా వ్యవహరించే బయటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. కుటుంబం లేదా వ్యాపారాలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఈ కౌన్సిల్ ముఖ్య పాత్ర పోషించనుంది. వచ్చే ఏడాది చివరి నాటికి వారసత్వ ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారట.

విభేదాలు వస్తే.. ఫోరం

విభేదాలు వస్తే.. ఫోరం

రిలయన్స్‌కు సంబంధించి తీసుకునే నిర్ణయంలో ఈ కౌన్సిల్ కీలక రోల్ పోషించనుందట. ప్రస్తుతం ముఖేష్ అంబానీ వయస్సు 63. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.13.50 లక్షల కోట్లు. ముఖేష్ ఆదాయం 80 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.6 లక్షల కోట్లు.ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రిలయన్స్ భవిష్యత్తు సాఫీగా సాగేలే భాగస్వామ్యం ఉండేలా కోరుకుంటున్నారు. భవిష్యత్తులో అంటే తర్వాతి తరంలో ఎప్పుడైనా ఏవైనా విబేధాలు వస్తే పరిష్కరించేందుకు ఈ ఫోరం ఉంటుంది.

అది రిపీట్ కావొద్దనే...

అది రిపీట్ కావొద్దనే...

ధీరూబాయ్ అంబానీ 1973లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. తర్వాత తరం అయిన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య విబేధాలు వచ్చాయి. తండ్రి చనిపోయిన మూడు నాలుగేళ్లకు విడిపోయారు. పదిహేనేళ్ల క్రితం ఈ సోదరులు విడిపోయాక.. ముఖేష్ అంబానీ రిలయన్స్‌ను ప్రపంచ దిగ్గజ సంస్థల్లో నిలిపారు. అనిల్ అంబానీ వ్యాపారంలో అప్పుల్లో కూరుకుపోయారు. అయితే అలాంటి విభేదాలతో రిలయన్స్ సంక్షోభంలో పడకుండా కాపాడటంతో పాటు, తండ్రిగా, కుటుంబ పెద్దగా, వియవంతమైన వ్యాపారవేత్తగా వారసుల విబేధాలకు సంబంధించి తమ అన్నదమ్ములు చరిత్ర పునరావృతం కావొద్దనే ఆశయంతో ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ముందు నుండే ముగ్గురు డైరెక్టర్స్‌గా..

ముందు నుండే ముగ్గురు డైరెక్టర్స్‌గా..

2014 అక్టోబర్‌లో ఆకాష్, ఇషా అంబానీలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, లిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్స్‌గా చేరారు. చిన్నవాడైన అనంత్‌ను మార్చిలో అదనపు డైరెక్టర్‌గా జియో ప్లాట్‌ఫాం బోర్డులో నియమించారు. ఆకాష్, ఇషా కూడా ఈ జియో ప్లాట్‌ఫాం బోర్డులో ఉన్నారు. ఇషా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆకాష్, అనంత్ అంబానీలు బ్రోన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇషా యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ కంప్లీట్ చేశారు.

English summary

ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం.. ప్యామిలీ కౌన్సిల్: వారసులకు సమాన బాధ్యతలు? | Mukesh Ambani plans to set up a family council

Mukesh Ambani, the world’s fourth-richest man, is setting up a family council to implement a collective governance structure to manage the family’s sprawling business empire as part of the group’s succession-planning process, two people directly aware of the discussions said.
Story first published: Friday, August 14, 2020, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X