For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ముఖేష్ అంబానీ, టాప్ 10 వీరే

|

ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్స్‌లో చేరాడు. తద్వారా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, టెస్లాఇంక్ సీఈవో ఎలాన్ మస్క్ సరసన చేరారు. ప్రపంచవ్యాప్తంగా 100 డాలర్ల సంపద కలిగిన వారు పదకొండు మంది ఉండగా, ఇందులో ముఖేష్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. వంద బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7.50 లక్షల కోట్ల ఆస్తి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇంత సంపాదన కలిగిన అతికొద్ది మందిలో రిలయన్స్ అధినేత నిలిచారు. శుక్రవారం నాటికి ముఖేష్ అంబానీ సంపద రూ.10,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఆయన ఆస్తి రూ.2380 కోట్ల డాలర్ల మేర పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇటీవల భారీగా లాభపడిన విషయం తెలిసిందే.

టాప్ 11 క్లబ్

టాప్ 11 క్లబ్

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినవారిలో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. 222.1 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ తొలి స్థానంలో ఉండగా, 190.8 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో, 155.6 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ అర్నాల్ట్ మూడో స్థానంలో, 127.9 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ నాలుగో స్థానంలో, 124.5 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ ఐదో స్థానంలో, 123.0 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్‌బర్గ్ ఆరో స్థానంలో, 120.1 బిలియన్ డాలర్లతో సెర్జీ బిన్ ఏడో స్థానంలో, 108.3 బిలియన్ డాలర్లతో లారీ ఎలిసన్ ఎనిమిదో స్థానంలో, 105.7 బిలియన్ డాలర్లతో స్టీవ్ బాల్మర్ తొమ్మిదో స్థానంలో, 103.4 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ పదో స్థానంలో, 100.6 బిలియన్ డాలర్లతో ముఖేష్ అంబానీ పదకొండో స్థానంలో నిలిచారు.

రిలయన్స్ మార్కెట్ క్యాప్ జంప్

రిలయన్స్ మార్కెట్ క్యాప్ జంప్

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర గతవారం భారీగా పెరిగింది. చివరి సెషన్‌లో అయింతే దాదాపు నాలుగు శాతం లాభపడింది. శుక్రవారం సెషన్‌లో 3.76 శాతం (రూ.96.80) ఎగిసిన రిలయన్స్ స్టాక్ రూ.2,669.20 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్‌లలో రిలయన్స్ స్టాక్ దాదాపు 5 శాతం లేదా రూ.126 లాభపడింది. నెల రోజుల్లో 12.55 శాతం లేదా రూ.297.65 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.17 లక్షల కోట్లను తాకింది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.1693170.17 కోట్లుగా ఉంది.

100 డాలర్ల బిలియనీర్స్

100 డాలర్ల బిలియనీర్స్

వారెన్ బఫెట్ అమెరికన్ ప్రముఖ వ్యాపారవేత్త. పిలాంత్రపిస్ట్. ప్రస్తుతం అతను బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీకి సీఈవోగా, చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్‌గా పేరు గాంచారు. స్టీవ్ బాల్మర్ అమెరికా వ్యాపారవేత్త మరియు ఇన్వెస్టర్. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రస్తుతం నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్‌ లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ యజమాని. లారీ ఎలిసన్ అమెరికన్ వ్యాపారవేత్త, ఇన్వెస్టర్. సెర్జీ బ్రిన్ కూడా అమెరికా వ్యాపారవేత్త, కంప్యూటర్ సైంటిస్ట్. అమెరికా మీడియా దిగ్గజం, ఇంటర్నెట్ ప్రెన్యూయర్, పిలాంత్రపిస్ట్ మార్క్ జుకర్‌బర్గ్. లారీ పేజ్ అమెరికా వ్యాపారవేత్త, కంప్యూటర్ సైంటిస్ట్.

English summary

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ముఖేష్ అంబానీ, టాప్ 10 వీరే | Mukesh Ambani enters the elite club of world's exclusive 100 billion dollar club

Mukesh Ambani joined Jeff Bezos and Elon Musk in the world’s most exclusive wealth club with a fortune of at least $100 billion.
Story first published: Sunday, October 10, 2021, 10:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X