For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Reliance AGM 2022: దీపావళి నాటికి మెట్రో నగరాల్లో 5జీ సేవలు.. దేశవ్యాప్తంగా అప్పటికి అందుబాటులోకన్న అంబానీ..

|

Reliance AGM 2022: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది. అయితే ఈరోజు కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) జరుగుతోంది. ఇందులో ఆర్‌ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రసంగం చేస్తున్నారు.

దీపావళి నాటికి 5జీ సేవలు..

దీపావళి నాటికి 5జీ సేవలు..

రాబోయే రెండు నెలల్లో దీపావళి నాటికి పూర్తి స్వదేశీ సాంకేతకతతో 5జీ సేవలను జియో అందుబాటులోకి తెస్తుందని ఆయన వెల్లడించారు. ఇందులో ముందుగా ప్రధాన మెట్రో నగరాలకు సేవలు అందుతాయని తన ప్రసంగంలో వెళ్లడించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై మహానగరాలతో సహా పలు కీలక నగరాల్లో జియో 5Gని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జియో 5G ఫుట్‌ప్రింట్‌ను నెలవారీగా పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ లక్ష్యంలో భాగంగా.. డిసెంబరు 2023 నాటికి అంటే నేటి నుండి 18 నెలల లోపు దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి తాలూకా, ప్రతి తహసీల్‌కు జియో 5Gని అందిస్తామని ముఖేష్ అంబానీ చెప్పారు.

గూగుల్ తో జతకట్టి..

గూగుల్ తో జతకట్టి..

భారతీయ మార్కెట్ వినియోగదారుల కోసం కంపెనీ సరసమైన అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లను అభివృద్ధి చేయడానికి Googleతో కలిసి పని చేస్తోందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో మోదీ ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ల దిగుమతులపై ఆంక్షలు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.12 వేల కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి దిగుమతులు నిలిచిపోతాయి.

 ఆకాష్ అంబానీ..

ఆకాష్ అంబానీ..

రిలయన్స్ జియో బాధ్యతలు అందుకున్న ఆకాష్ అంబానీ ఏజీఎంలో కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో 5G అందుబాటులోకి రావడంతో ప్రస్తుత 800 మిలియన్ల కనెక్ట్ చేయబడిన ఇంటర్నెట్ పరికరాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. కేవలం ఏడాదిలో వీటి సంఖ్య 1.5 బిలియన్ కనెక్ట్ చేయబడిన ఇంటర్నెట్ పరికరాల స్థాయికి చేరుకుంటుందని వెల్లడించారు.

జాప్యం లేని వేగం..

ట్రూ 5G బ్రాడ్‌బ్యాండ్ వేగంలో పురోగతిని అందించటంతో పాటు జాప్యాన్ని తీవ్రంగా తగ్గిస్తుందని అంబానీ అన్నారు. దేశంలోని అనేక బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లలో కూడా 1 Gbps ఇంటర్నెట్ వేగం అందుబాటులో లేదన్నారు. జియో 5G "అల్ట్రా-హై-స్పీడ్ ఫిక్స్‌డ్-బ్రాడ్‌బ్యాండ్" అని ఆకాష్ అంబానీ వెల్లడించారు. Jio 5G ద్వారా దేశంలోని ప్రతి తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి అధిక-నాణ్యత కలిగిన ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను అందించేందుకు అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆకాష్ పేర్కొన్నారు.

న్యూ ఎనర్జీ అండ్ సోలార్..

న్యూ ఎనర్జీ అండ్ సోలార్..

రానున్న కాలంలో దేశంలో సోలార్ ఎనర్జీ, ఇతర రెన్యూవబుల్ ఎనర్జీలపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికి తోడు న్యూ ఎనర్జీ వ్యాపారం ద్వారా చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగనున్నట్లు ప్రకటించారు. 2027 నాటికి బ్యాటరీ ప్యాక్స్ తయారీ సామర్థ్యాలను పెంచుకుంటామని అంబానీ వెల్లడించారు. వీటి ఉత్పత్తి 2023 నాటికి ప్రారంభమౌతుందని స్పష్టం చేశారు.

English summary

Reliance AGM 2022: దీపావళి నాటికి మెట్రో నగరాల్లో 5జీ సేవలు.. దేశవ్యాప్తంగా అప్పటికి అందుబాటులోకన్న అంబానీ.. | Mukesh Ambani announced that by diwali jio offer 5g services across metro cities in agm speach

Reliance Industries AGM 2022 Jio 5G to be out in Mumbai, Delhi, Kolkata, other metros by Diwali: Mukesh Ambani
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X