ఒకపక్క కరోనా మహమ్మారితో సతమతమవుతున్న భారతదేశాన్ని ఇప్పుడు బర్డ్ ఫ్లూ కూడా వేధిస్తోంది. ప్రస్తుతం దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరించింది. బర్డ్ ఫ్లూ దెబ్బ ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమకు గట్టిగా తాకుతోంది. దేశవ్యాప్తంగా చికెన్ తినాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ ప్రభావం మాజీ ఇండియన్ కెప్టెన్ ధోని కోళ్ల వ్యాపారానికి సైతం తాకింది.

కడక్ నాథ్ , గ్రామ ప్రియ కోళ్ళ ఆర్డర్లు రద్దు చేసుకున్న ధోనీ ఫామ్ నిర్వాహకులు
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని ప్రారంభించిన కడక్ నాథ్ కోళ్ల వ్యాపారానికి బర్డ్ ఫ్లూ సెగ తాకింది. మధ్యప్రదేశ్ కోళ్ల కు బర్డ్ ఫ్లూ సోకిన కారణంగా ధోని పౌల్ట్రీ కోసం ఆర్డర్ చేసిన రెండువేల కడక్ నాథ్ కోళ్లను, ఇదే సమయంలో రెండువేల గ్రామ ప్రియ కోళ్ల ఆర్డర్ ను రద్దు చేసుకున్నట్లు ధోని పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు పేర్కొన్నారు. సాంబో లోని ధోనికి సంబంధించిన పౌల్ట్రీ ఫామ్ ను పర్యవేక్షించే డాక్టర్ విశ్వ రంజన్ మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం రెండువేల కడక్ నాథ్ కోళ్లను, అంతే సంఖ్యలో గ్రామ ప్రియా కోళ్లను ఆర్డర్ ఇచ్చామని, అవి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ లోని జాబువా నుంచి రావాల్సిన కడక్ నాథ్ కోళ్ళు
అయితే మధ్యప్రదేశ్ లోని జాబువా నుంచి కడక్ నాథ్ కోళ్లను తీసుకు రావాల్సి ఉంది. ఇక గ్రామ ప్రియ కోళ్లను హైదరాబాద్ నుంచి తీసుకు రావలసి ఉండగా బర్డ్ ఫ్లూ హెచ్చరికల నేపథ్యంలో ఈ కొనుగోళ్ళ ఆర్డర్లు వాయిదా వేసినట్లుగా పేర్కొన్నారు. ధోని యొక్క నలభై మూడు ఎకరాల ఫామ్ హౌస్ లో ఒక భాగంగా పౌల్ట్రీ ఫామ్ కూడా నిర్వహిస్తున్నారు.అందులో కడక్ నాథ్ కోళ్ల ను, గ్రామ ప్రియా కోళ్లను పెంచుతున్నారు.

అత్యధిక పోషక విలువలు కలిగిన కోళ్ళను పెంచుతూ ధోనీ వ్యాపారం
అత్యధిక పోషక విలువలు కలిగిన నల్లటి కడక్ నాథ్ కోళ్లు ధర తొమ్మిది వందల రూపాయల నుండి 1200 వరకు ఉంటుంది. గ్రామ ప్రియ కోళ్ల ధర కూడా అదేవిధంగా పలుకుతుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ,ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇక మధ్యప్రదేశ్ నుండి కోళ్ల రవాణా జరగవలసిన నేపథ్యంలో ధోని ఫామ్ నిర్వాహకులు ప్రస్తుతానికి కొనుగోళ్లను పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications