For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండియన్ ఐటీ రంగానికి గుడ్ ఇయర్, కానీ సవాళ్లున్నాయి

|

భారత ఐటీ పరిశ్రమకు 2021 పండుగవంటిదేనని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వీ బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ క్యాలెండర్ ఏడాది ఐటీదే అన్నారు. అయితే సవాళ్లకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. కరోనా కారణంగా ఐటీ కంపెనీలు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కొత్త అవకాశాలను తెచ్చిందని చెప్పారు. దీంతో ఈ ఏడాది మెజార్టీ ఐటీ కంపెనీలు ఎక్కువ భాగం సింగిల్ డిజిట్‌లోనే మంచి వృద్ధి రేటు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్, ఆ వడ్డీ రేట్లు పెంపు: ఎన్ని రోజులకు ఎంత పెరిగాయంటే?కస్టమర్లకు SBI గుడ్‌న్యూస్, ఆ వడ్డీ రేట్లు పెంపు: ఎన్ని రోజులకు ఎంత పెరిగాయంటే?

ఐటీ రంగానికి కలిసి వస్తుంది

ఐటీ రంగానికి కలిసి వస్తుంది

ఐటీ రంగానికి ఈ క్యాలెండర్ ఇయర్ కలిసి వస్తుందని, ఎక్కువ కంపెనీలు 7 శాతం నుండి 9 శాతం వృద్ధి సాధిస్తాయని బాలకృష్ణన్ అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు క్లౌడ్ టెక్నాలజీకి మారుతున్నాయన్నారు. ఇది ఐటీ కంపెనీలకు అపార అవకాశమన్నారు. భారత ఐటీ కంపెనీలకు పెద్దసంఖ్యలో భారీ ఒప్పందాలు రావడం ఇందుకు నిదర్శనమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌‌తో ఇబ్బందులు కనిపించడం లేదని చెప్పారు. కొత్త వ్యాపార అవకాశాల్ని దక్కించుకోవడం ద్వారా కరోనాను ఐటీ సంస్థలు సమర్థంగా ఎదుర్కొన్నాయని చెప్పారు.

సవాళ్లు

సవాళ్లు

ప్రతి మూడు నాలుగేళ్ళకు ఓసారి ఆర్థికంగా లేదా టెక్నాలజీ పరంగా పెద్ద మార్పులు వస్తున్నాయన్నారు. కొత్త టెక్నాలజీలు పుట్టుకు రావడం లేదా పెద్ద దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వంటివి తలెత్తున్నాయని, ఐటీ కంపెనీలు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతూనే, స్టార్టప్ వ్యవస్థలతో కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రపంచ మార్కెట్ పైన

ప్రపంచ మార్కెట్ పైన

కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడం, పలు ఆవిష్కరణలు జరుగుతున్నందున స్టార్టప్ ఎకోసిస్టంతో కలిసి పని చేయడం అవసరం అన్నారు. కరోనాను చాలా స్టార్టప్స్ ఎదుర్కొన్నాయని, ప్రస్తుతం వాటికి ఫండింగ్ కూడా పెరిగిందన్నారు. మన స్టార్టప్స్ భారత మార్కెట్ల పైనే కాకుండా ప్రపంచ మార్కెట్లపై దృష్టి సారించాలన్నారు.

English summary

ఇండియన్ ఐటీ రంగానికి గుడ్ ఇయర్, కానీ సవాళ్లున్నాయి | Most Indian IT firms to post high single digit growth in 2021: Balakrishnan

India's information technology sector and most of the companies in the space are expected to clock high single digit growth, according to IT industry veteran V Balakrishnan.
Story first published: Monday, January 18, 2021, 7:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X