For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Companies: ఐటీ స్టాక్ ల టార్గెట్ ప్రైస్ తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. ఆదాయాలు తగ్గడమే ప్రధాన కారణం..

|

మోర్గాన్ స్టాన్లీ రెండు భారతీయ ఐటి సంస్థల రేటింగ్‌కు తగ్గించింది. ఈ రంగంలో వచ్చే రెండు త్రైమాసికాలలో పనితీరు తగ్గుతుందని అంచనా వేసింది. ఈ రంగం సమీప కాలంలో ఎదురుగాలి వీస్తుందని అంచనా వేసింది. ఐటీ కంపెనీల ఆదాయాలు తగ్గుతాయని ఒక నివేదికలో తెలిపింది. ఐటీ స్టాక్‌ల టార్గెట్ ప్రైస్ ను కూడా తగ్గించింది.అమెరికాలో పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, అట్రిషన్ వల్ల ఐటీ కంపెనీల వృద్ధి తగ్గుతుందని అభిప్రాయపడింది.

ఆదాయాలు క్షీణించాయి..

ఆదాయాలు క్షీణించాయి..

గత రెండు త్రైమాసికాల్లో పలు కంపెనీల ఆదాయాలు క్షీణించాయని గుర్తు చేసింది. అయితే స్టాక్‌లు ఇప్పటికీ ప్రీమియంలోనే ఉన్నాయని తెలిపింది. మోర్గాన్ స్టాన్లీ జూన్ 2023 త్రైమాసికంలో ఐటీ కంపెనీల వృద్ధి అట్టడుగు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. తద్వారా తదుపరి ఆరు నెలల్లో ఐటీ కంపెనీలకు ప్రతికూలత ఉంటందని పేర్కొంది.

టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్..

టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్..

మిడ్ క్యాప్స్ కంటే లార్జ్ క్యాప్‌ స్టాక్ పెట్టుబడికి అనుకూలమని అభిప్రాయపడింది. లార్జ్ క్యాప్స్‌లో టెక్ మహీంద్రా లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ పికింగ్ ఆర్డర్‌లో ముందున్నాయి. టెక్ మహీంద్రా మంచి గ్రోత్ విజిబిలిటీ, సహేతుకమైన వాల్యుయేషన్‌ను కలిగి ఉండగా, ఇన్ఫోసిస్ మార్కెట్ షేర్ లాభాలు, మార్జిన్ బాటమ్ అవుట్ ఉన్నాయని చెప్పింది.

విప్రో, హెచ్ సీఎల్..

విప్రో, హెచ్ సీఎల్..

విప్రో లిమిటెడ్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లను వేయిటేజ్ ను తగ్గించింది. సెక్టార్ వాల్యుయేషన్ తగ్గింపే ఇందుకు కారణంగా పేర్కొంది. "మిడ్ క్యాప్స్‌లో ఎంఫాసిస్‌ను మాత్రమే అధిక వేయిటేజ్ ఇచ్చారు. L&T ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీతో కలిసి సమాన వేయిటేజ్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ కూడా, స్థూల సవాళ్లు మధ్యకాలంలో IT మార్జిన్‌లను దెబ్బతీస్తాయని, అయితే ఈ రంగంపై "సానుకూల వైఖరి"ని కొనసాగిస్తున్నాయని పేర్కొంది.

English summary

IT Companies: ఐటీ స్టాక్ ల టార్గెట్ ప్రైస్ తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. ఆదాయాలు తగ్గడమే ప్రధాన కారణం.. | Morgan Stanley decreased Indian IT Stocks target prices

Morgan Stanley downgraded two Indian IT firms to its lowest rating as it expects subdued performance for the sector to continue in the next two quarters.
Story first published: Saturday, July 16, 2022, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X