For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ

|

2022-23, అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరాలకు గాను భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది మోర్గాన్ స్టాన్లీ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.6 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను 6.7 శాతానికి తగ్గించింది. సైక్లికల్ రికవరీ ట్రెండ్ కొనసాగుతుందని భావించినప్పటికీ, ఇది గతంలో అంచనా వేసిన దాని కంటే మృదువుగా సాగుతుందని పేర్కొంది.

నెమ్మదించిన ప్రపంచ వృద్ధి, వాణిజ్య షాక్ వంటి ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తదితర అంశాలు వ్యాపార విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని సమీప కాల దృక్పథాన్ని అంచనా వేసింది మోర్గాన్ స్టాన్లీ. తమ గ్లోబల్ ఎకనమిక్స్ టీమ్ 2022 క్యాలెండర్ డాదిలో వృద్ధి రేటును 6.2 శాతం నుండి 2.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.9 శాతం నుండి 7.6 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 7 శాతం నుండి 6.7 శాతానికి తగ్గించింది.

Morgan Stanley Cuts Indias Gdp Growth Forecast For Fy23

ప్రభుత్వ విధాన సంస్కరణలు, సామర్థ్య వినియోగస్థాయిల పెరుగుదలతో పాటు ప్రభుత్వ మౌలిక సదుపాయాల వ్యయ విస్తరణ, ప్రయివేటు కాపెక్స్ 6 నుండి 9 నెలల్లో కోలుకోవడానికి సహాయపడతాయని పేర్కొంది. ప్రపంచ వృద్ధిలో మందగమనం, ఉత్పత్తుల అధిక ధరలు, గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ ప్రభావం భారత్ పైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం అధిక ద్రవ్యోల్భణం, బలహీన వినియోగ డిమాండ్, కఠిన ఆర్థిక పరిస్థితులు, వ్యాపార సెంటిమెంట్ పైన ప్రతికూల ప్రభావం క్యాపెక్స్ రికవరీలో జాప్యానికి కారణమని తెలిపింది.

English summary

భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ | Morgan Stanley Cuts India's Gdp Growth Forecast For Fy23

Building in higher oil prices and slower global growth, Morgan Stanley has trimed India's GDP growth forecasts to 7.6% for F2023 and to 6.7% for F2024.
Story first published: Wednesday, May 11, 2022, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X