For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోడీ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే, ఇలా చేయండి: రఘురాం రాజన్ సూచనలు

|

న్యూఢిల్లీ: ప్రపంచంతో పాటు భారతదేశం తీవ్ర ఆర్థిక మందగమనం పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మందగమనం కారణంగా ఎలాంటి చర్యలు చేపడితే దానిని గాడిలో పెట్టవచ్చనే సూచనలు చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థపై స్పందించారు.

అంతా ప్రధాని కార్యాలయం నుంచే, మంత్రులు డమ్మీలు: రఘురాం రాజన్ తీవ్ర విమర్శలు

ఇలా పోటీ పెంచాలి...

ఇలా పోటీ పెంచాలి...

మూలధనం సమకూర్చడంలో, భూ, కార్మిక రంగాల్లో సంస్కరణలు చేపట్టడం ద్వారా వృద్ధితో పాటు పెట్టుబడులను ప్రోత్సహించవచ్చునని రాజన్ తెలిపారు. పోటీని పెంచేందుకు, దేశీయ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం స్థిరంగా ఉంటేనే మోడీ ప్రభుత్వం కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. అది వాస్తవ రూపం దాల్చేలా లేదన్నారు.

పీఎంవో చుట్టూ సరికాదు

పీఎంవో చుట్టూ సరికాదు

అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ముందు పరస్తుత ప్రభుత్వ కేంద్రీకృత విధానం నుంచి ప్రారంభించాలని, ఎందుకంటే ఏ చిన్న నిర్ణయం అయినా ప్రధాని చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు లేదా ప్రధాని కార్యాలయం నుంచి వెలువడుతున్నాయన్నారు. ప్రధాని కార్యాలయం నుంచే ప్రణాళికలు, ఆలోచనలు సరికాదన్నారు. ఇది రాజకీయ, సామాజిక అజెండాలకు పీఎంవో తీరు సరిపోతుందేమో కానీ ఆర్థిక సంస్కరణలకు ఇది పనికి రాదన్నారు.

మోడీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్

మోడీ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్

ఇదివరకటి ప్రభుత్వాలు కూడా పొరపాట్లు చేసి ఉండవచ్చునని, అవి ఆర్థిక సరళీకరణకు పెద్దపీట వేశాయని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దానిపై దృష్టి సారించడం లేదని రాజన్ అన్నారు. మంత్రులకు దిశా-నిర్దేశం చేసేవారే లేరని వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం సామాన్య ప్రభుత్వం-సుపరిపాలన నినాదంతో అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ అలా ఏమీ జరగడం లేదన్నారు. నగదు బదిలీ వంటి కొన్ని విజయాలు సాధించినా ఎన్నో నిర్ణయాలు ప్రతికూల ఫలితాల్ని వచ్చాయన్నారు. ఆర్థిక మందగమనం నుంచి దేశాన్ని బయటకు పడేయడమే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అన్నారు.

మంత్రులు స్వతంత్రంగా పని చేసే పరిస్థితి కావాలి

మంత్రులు స్వతంత్రంగా పని చేసే పరిస్థితి కావాలి

భూసేకరణ, కార్మిక చట్టాలు, స్థిరమైన పన్నులు, ప్రభావవంతమైన నియంత్రణ వ్యవస్థ, వేగవంతమైన దివాలా పరిష్కారాలు, విద్యుత్ సంస్కరణలు అవసరమని రాజన్ పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ, స్థిరాస్తి, మౌలిక రంగాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)లు తమ రుణాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరుద్యోగం పెరిగిపోతోందని, దేశీయ వ్యాపారాల్లో పెట్టుబడులు సన్నగిల్లుతున్నాయన్నారు. మంత్రులు స్వతంత్రంగా పని చేసే పరిస్థితి కల్పించాలన్నారు. రాష్ట్రాలతో కేంద్రానికి సత్సంబంధాలు ముఖ్యమన్నారు.

మేం చెబుతుంటే... తొక్కిపెట్టవద్దు..

మేం చెబుతుంటే... తొక్కిపెట్టవద్దు..

ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యల్లో ఉన్నా మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు సమస్య తీవ్రతను గుర్తించడం లేదని, ఇది సరికాదని రాజన్ అన్నారు. ముందు సమస్య తీవ్రతను గుర్తించాలని, సమస్యను తెలియజెప్పే వారికి రాజకీయ దురుద్దేశాలు అంటగట్టడం సరికాదని, అలాగే ఆర్థిక మందగమనం తాత్కాలికమనే నమ్మకం నుంచి ప్రభుత్వం బయటపడాలని, దీనికి సంబంధించి వచ్చే ప్రతికూల వార్తలు, సర్వేలను తొక్కిపెట్టడం కూడా సరికాదన్నారు.

లోతైన సంస్కరణలు అవసరం

లోతైన సంస్కరణలు అవసరం

మందగమనం నుంచి బయటపడాలంటే లోతైన సంస్కరణలు తప్పనిసరి అన్నారు. విద్యుత్ సరఫరాకు సరైన ధరలు నిర్ణయిచడంతోపాటు టెలికాం రంగంలో పోటీని కాపాడాలన్నారు. రైతులకు రుణాలతోపాటు సరైన ఉత్పాదకాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అయితే ఈ సంస్కరణల విషయలో మోడీ సర్కార్ ఎందుకో ధైర్యం చేయలేకపోతోందని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రతి రంగమూ సమస్యల్లో ఉందన్నారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల నాణ్యత పైనా సమీక్ష జరగాలన్నారు. కంపెనీలతో పాటు గృహ రుణాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగం తీవ్ర కష్టాల్లో ఉందనేందుకు ఇవే సూచీకలు అన్నారు.

English summary

Modi government should acknowledge the problem of economic slowdown: Raghuram Rajan

మూలధనం సమకూర్చడంలో, భూ, కార్మిక రంగాల్లో సంస్కరణలు చేపట్టడం ద్వారా వృద్ధితో పాటు పెట్టుబడులను ప్రోత్సహించవచ్చునని రాజన్ తెలిపారు. పోటీని పెంచేందుకు, దేశీయ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత వృద్ధి రేటు 8 శాతం నుంచి 9 శాతం స్థిరంగా ఉంటేనే మోడీ ప్రభుత్వం కోరుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. అది వాస్తవ రూపం దాల్చేలా లేదన్నారు.
Story first published: Monday, December 9, 2019, 9:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X