For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Subsidy On Drones: రైతులకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు సబ్సిడీ.. మోదీ సర్కార్ నిర్ణయం..

|

Subsidy On Drones: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ డ్రోన్‌లకు భారీగా సబ్సిడీ అందించేందుకు ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

చిన్న రైతులు..

చిన్న రైతులు..

పంటలకు ఎరువులతో పాటు ఇతర రసాయనాలను సులభంగా పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగం పెరిగింది. మన దేశంలో చిన్నసన్నకారు రైతుల సంఖ్య ఎక్కువ. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రికీకరణ అనివార్యంగా మారింది. అందుకే చిన్న రైతుల ప్రోత్సాహకానికి, వారికి మెరుగైన ఆదాయాన్ని అందించేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది.

డ్రోన్ల వినియోగం..

డ్రోన్ల వినియోగం..

డ్రోన్ కెమెరాలను కేవలం రసాయనాల పితికారీకి మాత్రమే కాక.. పొలంపై ఓ కన్నేసి ఉంటేందుకు కూడా వినియోగించవచ్చు. రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే డ్రోన్లపై 50 శాతం అంటే దాదాపు రూ.5 లక్షల కవర్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం వ్యవసాయ అవసరాల కోసం కొనుగోలు చేసిన డ్రోన్లపై రైతులకు ఆర్థిక సహాయం అందుతుంది.

నూతన వ్యవసాయానికి..

నూతన వ్యవసాయానికి..

దేశంలోని రైతులను నూతన వ్యవసాయ సాంకేతికతల వైపు నడిపేందుకు.. తక్కువ సమయం, పెట్టుబడితో మంచి దిగుబడి, ఆర్థిక ఫలితాలను పొందేందుకు రైతులను సమకాలీకరించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం సహాయపడుతుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.

 సబ్సిడీకి అర్హతలు..

సబ్సిడీకి అర్హతలు..

కేంద్రం తెచ్చిన డ్రోన్ సబ్సిడీ స్కీమ్ కి సన్నకారు రైతులు, ఈశాన్య రాష్ట్రాల రైతులు, మహిళా రైతులు గరిష్ఠంగా డ్రోన్ ధరలో 50 శాతం లేదా రూ.5 లక్షల వరకు పొందేందుకు అర్హులు. ఇతర రైతులు మాత్రం డ్రోన్‌పై రూ.4 లక్షల వరకు లేదా డ్రోన్ ధరలో 40 శాతం వరకు సబ్సిడీని పొందవచ్చు. డ్రోన్లను UAVలు అని పిలుస్తారు. అంటే ఇవి మానవరహిత వైమానిక వాహనాలని అర్ధం.

English summary

Subsidy On Drones: రైతులకు శుభవార్త.. రూ.5 లక్షల వరకు సబ్సిడీ.. మోదీ సర్కార్ నిర్ణయం.. | Modi government providing upto 5 lakh rupees subsidy on agricultural drones

Modi government providing upto 5 lakh rupees subsidy on agricultural drones
Story first published: Monday, November 14, 2022, 16:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X