For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

MSME News: చిన్న వ్యాపారులకు కేంద్రం శుభవార్త.. త్వరలో క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే..

|

Business Credit Card: ఇప్పటి వరకు క్రెడిట్ కార్డుల గురించి మనం చాలా వార్తలు విని ఉంటాం. కానీ.. ఇది సామాన్య వినియోదారుల కోసం ఉద్ధేశించింది కాదు. కిసాన్ క్రెడిట్ కార్డ్ తరహాలోనే.. చిరు వ్యాపారులకు బిజినెస్ క్రెడిట్ కార్డులు ఇచ్చే దిశగా మోడీ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దేశంలో 6.30 కోట్ల చిన్న పరిశ్రమలు, 3.31 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. 1.5 కోట్ల కంటే తక్కువ MSMEలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాయి.

చిరు వ్యాపారులకు ఉపయోగాలు..

చిరు వ్యాపారులకు ఉపయోగాలు..

ఈ కార్డుల జారీ చిన్న వ్యాపారులకు నిజంగా చాలా పెద్ద ఊరట అని చెప్పాలి. దీంతో వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు ఎలాంటి తనఖా లేకుండానే చౌకగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ, వివిధ బ్యాంకులతో ఇప్పటికే చర్చలు కూడా జరిపింది.ఈ కార్డ్ క్రెడిట్ లిమిట్ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. అంటే చిన్న వ్యాపారులు గరిష్ఠంగా లక్ష వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ కార్డుకు అర్హత..

క్రెడిట్ కార్డుకు అర్హత..

MSME మంత్రిత్వ శాఖకు సంబంధించిన Udyam పోర్టల్‌లో నమోదు చేసుకున్న వ్యాపారవేత్తలకు మాత్రమే వ్యాపార క్రెడిట్ కార్డ్‌లను ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ఎంటర్‌ప్రైజ్ పోర్టల్‌లో నమోదు చేసుకోని కోట్లాది పరిశ్రమలు ఉన్నాయి. వ్యాపార్ క్రెడిట్ కార్డ్‌ల ప్రారంభంతో.. అనేక మంది వ్యాపారులు కూడా ఎంటర్‌ప్రైజ్ పోర్టల్‌కి కనెక్ట్ అవుతారు. వ్యాపార క్రెడిట్ కార్డ్ జారీ కిరాణా దుకాణదారులకు, సెలూన్ యజమానులకు కూడా జారీ చేయబడుతుంది.

ఎందుకు అవసరం..

ఎందుకు అవసరం..

కరోనా కాలం తరువాత.. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రంగం (MSME) అతిపెద్ద ఎదురుదెబ్బను చవిచూసింది. దీనికి తోడు కరోనాకు ముందు కేంద్రం తీసుకొచ్చిన.. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం కూడా వీరిని చావుదెబ్బ కొట్టాయి. ఈ రంగానికి ఉపశమనం కలిగించడానికి, పార్లమెంటరీ స్థాయీ సంఘం ఫైనాన్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్ తరహాలో చిన్న వ్యాపారులకు 'వ్యాపార్ క్రెడిట్ కార్డ్'ని అందించాలని సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని, త్వరలోనే ఈ స్కీమ్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

కార్డు ప్రయోజనాలు..

కార్డు ప్రయోజనాలు..

* Udyam పోర్టల్‌లో నమోదు చేసుకున్న వెంటనే వ్యాపారులకు 'వ్యాపార క్రెడిట్ కార్డ్‌'లు అందిస్తారు

* MSMEలకు ఎంత పెద్ద రుణాలు ఇవ్వాలనుకుంటున్నాయనేది బ్యాంకులు నిర్ణయించుకుంటాయి.

* క్రెడిట్ కార్డుతో వ్యాపారులు మెటీరియల్, పరికరాలు కొనుగోళ్లకు చెల్లింపులు చేయవచ్చు.

* వ్యాపారం ఆదాయం పెరిగేకొద్దీ, క్రెడిట్ పరిమితి కూడా పెరుగుతుంది.

* క్రెడిట్ కార్డ్‌ల ద్వారా లాయల్టీ పాయింట్‌లు, రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్స్ ఇతర ప్రయోజనాలు ఉంటాయి

English summary

MSME News: చిన్న వ్యాపారులకు కేంద్రం శుభవార్త.. త్వరలో క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే.. | modi government descided to offer credit cards to small and msme businesses to get easy credit on time at cheaper costs

modi government descided to offer credit cards to msme businesses
Story first published: Friday, July 29, 2022, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X