For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్రోసాఫ్ట్, గూగుల్ పైనా కరోనా దెబ్బ: కొత్త ఉద్యోగాలపై సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే?

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఇండియా సహా వివిధ దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఉత్పత్తి - డిమాండ్ పడిపోయింది. వివిధ రంగాలు భారీగా నష్టపోతున్నాయి. కరోనా కారణంగా చమురుకు డిమాండ్ లేక ఏకంగా జీరో డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. వివిధ రంగాల్లోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు తగ్గించడం లేదా ఉద్యోగాలు కట్ చేయడం చేస్తున్నాయి.

ఉల్లంఘన ఎలా అవుతుంది: చైనాకు భారత్ ధీటుగా సమాధానంఉల్లంఘన ఎలా అవుతుంది: చైనాకు భారత్ ధీటుగా సమాధానం

మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై కూడా కరోనా ప్రభావం

మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై కూడా కరోనా ప్రభావం

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, సెర్చింజన్ గూగుల్ పైన కూడా కరోనా మహమ్మారి ప్రభావం పడింది. ఈ కంపెనీల్లో రిక్రూట్మెంట్స్ పూర్తిగా నిలిచిపోవడం లేదా సగానికి పైగా నిలిచిపోవడం జరిగింది. సాఫ్టువేర్ కంపెనీల నుండి దాదాపు అన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా హైరింగ్స్ నిలిచిపోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలు కూడా కరోనా బారి నుండి తప్పించుకోలేని పరిస్థితులు.

మైక్రోసాఫ్ట్‌లో 46 శాతం తగ్గుదల

మైక్రోసాఫ్ట్‌లో 46 శాతం తగ్గుదల

మైక్రోసాఫ్ట్ గత మూడు వారాలుగా జాబ్ ఓపెనింగ్స్‌ను సగం వరకు తగ్గంచాయి. మార్చి 22, 2020 నాటికి మైక్రోసాఫ్ట్‌లో 5,5800 ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఏప్రిల్ 20 నాటికి కేవలం 3,28 ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే హైరింగ్ యాక్టివిటీ 46 శాతం మేర తగ్గింది.

లింక్డిన్‌లో భారీ తగ్గుదల

లింక్డిన్‌లో భారీ తగ్గుదల

లింక్డిన్‌లోను జాబ్ ఓపెనింగ్స్ పెద్ద మొత్తంలో పడిపోయాయి. మార్చి 1, 2020 నాటికి లింక్డిన్‌లో 510 ఓపెనింగ్స్ ఉంటే ఈ వారం మొత్తం కేవలం 2 ఓపెనింగ్స్ మాత్రమే ఉండటం గమార్హం. ఈ మేరకు లింక్డిన్ డేటా చూపిస్తోంది.

గూగుల్‌లో హైరింగ్స్ ఫ్రీజ్

గూగుల్‌లో హైరింగ్స్ ఫ్రీజ్

సెర్చింజన్ గూగుల్ జాబ్ ఓపెనింగ్స్ ఫ్రీజ్ చేసింది. గత ఏడాది 20,000 మంది ఉద్యోగులను తీసుకుంది ఈ సంస్థ. ఈసారి కరోనా మహమ్మారి కారణంగా జాబ్ ఓపెనింగ్స్‌ను ఫ్రీజ్ చేయాలని భావిస్తోంది. మీడియాలో వస్తున్న సమాచారం మేరకు హైరింగ్‌ను గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితులు అని గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారట.

English summary

మైక్రోసాఫ్ట్, గూగుల్ పైనా కరోనా దెబ్బ: కొత్త ఉద్యోగాలపై సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? | Microsoft reports 46 percent drop in recruitment, Google freezes hiring

As the COVID-19 pandemic continues to disrupt global economies, firms across the world have stopped fresh hiring. Tech-giant Microsoft has reduced job openings to nearly half in just the past three weeks.
Story first published: Wednesday, April 22, 2020, 15:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X