For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Darwinbox: హైదరాబాద్‌ తొలి యూనికార్న్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు

|

భారత అంకురాల్లోకి పెట్టుబడులు మందగిస్తున్న వేళ.. హైదరాబాద్‌ తొలి యూనికార్న్‌ (మార్కెట్‌ వాల్యూ 100 కోట్ల డాలర్లకు పైబడిన స్టార్టప్) డార్విన్‌బాక్స్‌లో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెట్టినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) విభాగంలో మానవ వనరుల (హెచ్‌ఆర్‌) టెక్నాలజీ సేవలు అందిస్తుంటుందీ సంస్థ.

ఉద్యోగుల రిటెన్షన్ ధ్యేయంగా...

ఉద్యోగుల రిటెన్షన్ ధ్యేయంగా...

ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడంలో కార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మానవ వనరుల విభాగంలో సాంకేతికను విస్తరించేందుకు అజూర్‌ వినియోగానికిగానూ మైక్రోసాఫ్ట్‌తో డార్విన్‌బాక్స్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు 'వీసీ సర్కిల్' నివేదిక వెల్లడించింది. తద్వారా కృత్రిమ మేధస్సుతో ఉద్యోగి అవసరాలన్నిటికీ టెక్నాలజీ ఆధారంగా పరిష్కారం చూపడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది.

వందలకొద్దీ క్లైంట్‌లు

వందలకొద్దీ క్లైంట్‌లు

డార్విన్‌బాక్స్‌ను 2015లో హైదరాబాద్‌లో స్థాపించగా.. గతేడాది యూనికార్న్‌ క్లబ్‌లో చేరింది. సింగపూర్‌ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంగా 700 కంటే ఎక్కువ కార్పొరేట్ సంస్థలకు సేవలు అందిస్తోంది. ప్రస్తుత పెట్టుబడిదారులైన టెక్నాలజీ క్రాస్ఓవర్ వెంచర్స్, సేల్స్‌ఫోర్స్ వెంచర్స్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, లైట్‌స్పీడ్ ఇండియా, ఎండియా పార్టనర్స్, 3One4Capital, జేటీడీఈవీ, ఎస్‌సీబీ 10X భాగస్వామ్యంతో కలిసి ముందుకు దూసుకుపోతోంది.

విదేశాల్లోనూ హవా

విదేశాల్లోనూ హవా

ఇండొనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోనూ డార్విన్‌బాక్స్‌ విస్తరించింది. ఆగ్నేయాసియా, భారత్‌ నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతోంది. పశ్చిమాసియా, సౌదీ అరేబియా, యూఏఈ, యూఎస్‌లలో కొత్త కార్యాలయాలను సైతం ప్రారంభించింది.

English summary

Darwinbox: హైదరాబాద్‌ తొలి యూనికార్న్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు | Microsoft invested in first unicorn from hyderabad Darwinbox

Microsoft investments into Darwinbox..
Story first published: Wednesday, January 18, 2023, 6:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X