For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT News: బాంబ్ పేల్చిన మైక్రోసాఫ్ట్.. ఫుల్ టైం ఉద్యోగులకు ఈ ఏడాది..

|

IT News: చిన్న, పెద్ద తేడా లేకుండా ఆయా కంపెనీల ఖర్చులు తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. లేఆఫ్ లతో ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నాయి. జీతాల్లో కోతలు, ఫ్రెషర్స్ ఆన్‌బోర్డింగ్ నిలిపివేయడం, హైరింగ్ హోల్డ్ చేయడం సహా కుదిరినన్ని రకాలుగా సేవింగ్ స్టార్ట్ చేశాయి. మైక్రోసాఫ్ట్ మరో అడుగు ముందుకేసి ఈ ఏడాది ఉద్యోగుల జీతాలపై బాంబ్ పేల్చింది.

ఆర్థిక అనిశ్చితులు మరియు AI వల్ల IT ఇండస్ట్రీలో చోటు చేసుకున్న పరిణామాలు వెరసి మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. సంస్థలో ఫుల్ టైం సిబ్బందికి ఎవరికీ ఈ ఏడాది జీతాల పెంపు ఉండదంటూ షాక్ ఇచ్చింది. కంపెనీ CEO సత్య నాదెళ్ల ఈ మేరకు ఉద్యోగులకు మెయిల్ పంపించారు. ఈ మొత్తాన్ని మార్కెట్ కు అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం వెచ్చించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Microsoft holds salary hikes for employees this year.

"కస్టమర్ డిమాండ్, లేబర్ మార్కెట్ మరియు ఇన్నోవేషన్ అప్‌ డేషన్ కోసం అవసరమైన పెట్టుబడులు సహా అనేక కోణాలలో.. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితులు ఛాలెంజింగ్‌గా ఉన్నాయి" అని మైక్రోసాప్ట్ CEO పంపిన అంతర్గత మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. 'Preparing for rewards' అనే సబ్జెక్ట్ లైన్‌తో ఉన్న ఇమెయిల్‌లో సత్య నాదెళ్ల ఈ విషయాన్ని వెల్లడించారు. తెలిపారు.

"ఒక సీనియర్ నాయకుడిగా ఈ నిర్ణయానికి రావడానికి చాలా నెలల సమయం పట్టింది. అన్ని ఇతర విషయాలనూ పరిగణలోనికి తీసుకున్న తర్వాతే సిబ్బందికి సమాచారం ఇచ్చాం. దీర్ఘకాలిక విజయానికి కంపెనీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నాము" అని కంపెనీ CEO తెలిపారు. అయితే పార్ట్ టైం ఉద్యోగులకు మాత్రం వేతన పెరుగుదల ఉండనున్నట్లు వెల్లడించారు.

Read more about: it news microsoft salary hikes
English summary

IT News: బాంబ్ పేల్చిన మైక్రోసాఫ్ట్.. ఫుల్ టైం ఉద్యోగులకు ఈ ఏడాది.. | Microsoft holds salary hikes for employees this year.

Microsoft holds salary hikes for employees this year.
Story first published: Thursday, May 11, 2023, 7:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X