For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ దేశ జైలులో గాయాలతో మెహుల్ చోక్సీ: నిందితుడికి అక్కడి విపక్ష నేత అండ!

|

PNB స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కేసులో ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల అతను ఆంటిగ్వా నుండి పారిపోయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అతనికి సంబంధించిన ఫోటోలు అంటూ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అతను డొమినికాలో పోలీస్ కస్టడీలో ఉన్నట్లు ఆ ఫోటోల ద్వారా వెల్లడవుతోంది. అతను జైలులో ఉన్నట్లుగా ఫోటోలు వెలుగు చూశాయి. అతని ఒంటి పైన గాయాలు కూడా కనిపిస్తోన్నట్లుగా తెలుస్తోంది.

<strong>క్రిప్టో మైనింగ్‌పై 4 నెలలు ఇరాన్ బ్యాన్, ఈ దేశాల్లో వర్చువల్ కరెన్సీ నిషేధం</strong>క్రిప్టో మైనింగ్‌పై 4 నెలలు ఇరాన్ బ్యాన్, ఈ దేశాల్లో వర్చువల్ కరెన్సీ నిషేధం

రాజ్యాంగ రక్షణ

రాజ్యాంగ రక్షణ

మరోవైపు మెహుల్ చోక్సీని భారత్‌కు రప్పించే అంశానికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. చోక్సీ భారత పౌరుడు కాదని, ఆంటిగ్వా పౌరుడు అని ఆయన తరపు లాయర్ వాదిస్తున్నాడు. చోక్సీకి భారత పౌరసత్వం లేనందున భారత్ పంపించడం సాధ్యం కాదంటున్నాడు. ఆంటిగ్వా ప్రభుత్వం తమ దేశ పౌరుల హక్కులను కాపాడే ప్రయత్నాలు చేస్తుందన్నాడు. ఆంటిగ్వా దేశం నుండి రాజ్యాంగబద్దమైన రక్షణ ఉంటుందని చెప్పాడు. ఆంటిగ్వా కల్పించే ఉపశమనాలు అన్నీ కూడా చోక్సీకి వర్తిస్తాయనిచెప్పాడు.

విపక్ష నేత అండ

విపక్ష నేత అండ

చోక్సీని డొమినికాలో అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ, అతనిని అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నాడు. అంతేకాదు, డొమినికా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు చోక్సీ తరఫు లాయర్. తన క్లయింట్ శరీరం పైన గాయాలు ఉన్నాయన్నాడు. మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించరాదని ఆంటిగ్వా విపక్ష నేత కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆంటిగ్వా యునైటెడ్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత, మాజీ మంత్రి హెరాల్డ్ లోవెల్ మాట్లాడుతూ.. తమ దేశ చట్టాల ప్రకారం ఆయనను భారత్‌కు అప్పగించరాదన్నారు.

ఆ దేశ అధ్యక్షుడు ఏమన్నారంటే

ఆ దేశ అధ్యక్షుడు ఏమన్నారంటే

తమ దేశ చట్టాల ప్రకారం ఈ దేశ పౌరులను ఇతర దేశాలకు అప్పగించరాదని చెప్పారు ఆంటిగ్వా విపక్ష నేత. అయితే డొమినికా అప్పగిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. తాను మెహుల్ చోక్సీ తరఫున మాట్లాడటం లేదని, కానీ ఈ దేశ పౌరుడిగా ఆయనకు కొన్ని హక్కులు ఉన్నాయని చెప్పారు.

చోక్సీపై కేసులకు సంబంధించి విచారణ ఇక్కడే జరగాలన్నారు. కోర్టు నిర్ణయం మేరకు అప్పగించవచ్చునని చెప్పారు. చోక్సీ అక్రమంగా డొమినికాలో ప్రవేశించినందుకు అతనిని అరెస్ట్ చేయడంతో పాటు భారత్‌కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రధాని గెస్టన్ బ్రౌన్ వ్యాఖ్యానించడాన్ని విపక్ష నేత తప్పుబట్టారు. ఇది సరైన తీరు కాదన్నారు.

English summary

ఆ దేశ జైలులో గాయాలతో మెహుల్ చోక్సీ: నిందితుడికి అక్కడి విపక్ష నేత అండ! | Mehul Choksi Seen In Dominica Police Custody In New Photo

Fugitive jeweller Mehul Choksi was seen in the custody of the police in Dominica in a photo obtained by local media on Saturday shortly after a court in the Caribbean island nation extended till Wednesday its order restraining his deportation.
Story first published: Sunday, May 30, 2021, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X