For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sunscreen Sales: రికార్డు స్థాయిలో సన్‌స్క్రీన్‌ల అమ్మకాలు.. 55 శాతం ఎక్కువగా.. కారణమేంటంటే..

|

Sunscreen Sales: దేశంలో ఈసారి రికార్డు స్థాయిలో వేడి పెరగడంతో పాటు సన్‌స్క్రీన్‌ల అమ్మకాలు సైతం పెరిగాయి. IMS సంస్థ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. 2020తో పోలిస్తే ఈ ఏడాది మేలో మెడికేటెడ్ సన్‌స్క్రీన్ అమ్మకాలు దాదాపు 55 శాతం పెరిగాయి. మెడికేటెడ్ సన్‌స్క్రీన్‌లను ఫార్మాస్యూటికల్ కంపెనీలు తయారు చేస్తుంటాయి. సాధారణ సన్‌స్క్రీన్‌లు సౌందర్య సాధనంగా ఉంటాయి.

మార్చి 2020లో దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో సన్‌స్క్రీన్‌ల అమ్మకాలు క్షీణించాయి. దీనికి కారణం ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్లలోనే ఉండటం వల్ల వారికి ఈ సన్ ప్రొటెక్షన్ క్రీమ్ అవసరం తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు దాని మార్కెట్ 10 నుంచి 15 శాతం చొప్పున పెరుగుతోంది. దేశంలో సన్‌స్క్రీన్‌ల మార్కెట్ దాదాపు 300 కోట్లుగా ఉంది.

ఏఏ కంపెనీలు అమ్ముతున్నాయి..

ఏఏ కంపెనీలు అమ్ముతున్నాయి..

ప్రధాన సన్‌స్క్రీన్ కంపెనీల్లో సన్ ఫార్మా, H &H, IPCA, గ్లెన్‌మార్క్ ఉన్నాయి. చాలా కంపెనీలు ఈ ఏడాది తమ విక్రయాలను రెండు నుంచి మూడు రెట్లు పెంచుకున్నాయి. సన్‌స్కిన్ అమ్మకాలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం.. ప్రజల్లో దీనిపై అవగాహన పెరగడం కాగా.. మరొకటి ప్రిస్కైబ్ చేయబడ్డ మందుల లభ్యత పెరగటం.

రేటు ఎక్కువైనప్పటికీ..

రేటు ఎక్కువైనప్పటికీ..

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రిస్క్రిప్షన్ సన్‌స్క్రీన్‌లు సాధారణ సన్‌స్క్రీన్‌ల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతున్నప్పటికీ అవి బాగా ప్రాచుర్యం పొందాయి. చాలా ఔషధ సన్‌స్క్రీన్‌లు ప్రిస్క్రిప్షన్ ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ, అవి కౌంటర్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

మెుటిమలు ఉన్న వారికి..

మెుటిమలు ఉన్న వారికి..

మొటిమల వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి వైద్యులు కొన్ని సన్‌స్క్రీన్‌లను సిఫార్సు చేస్తారు. మే నెలలో చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల్లో సన్‌స్క్రీన్‌లు అత్యధిక వృద్ధిని సాధించాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 150 శాతం పెరిగాయి. అయితే.. దీనికి ఒక కారణం గత సంవత్సరం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నందున అప్పుడు వినియోగం కొంత తక్కువగానే ఉంది.

అమ్మకాలు ఇందుకే పెరుగుతున్నాయి..

అమ్మకాలు ఇందుకే పెరుగుతున్నాయి..

సన్‌స్క్రీన్ మార్కెట్ బూమ్‌కి రెండు కారణాలు ఉన్నాయని సన్ ఫార్మా ఇండియా బిజినెస్ సీఈవో కీర్తి గనోర్కర్ అన్నారు. మొదటి కారణం గత సంవత్సరం వినియోగం తక్కువగా ఉండటం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా కార్యాలయాలు తెరుచుకోవడం రెండో కారణమని అన్నారు.

దీంతో పాటు దేశంలో సన్‌స్క్రీన్‌పై అవగాహన పెరుగుతోందని కీర్తి తెలిపారు. ప్రిస్క్రిప్షన్ సన్‌స్క్రీన్ మార్కెట్‌లో సన్ ఫార్మా 18 శాతం వాటాను కలిగి ఉంది. కంపెనీకి ఫోటోస్టేబుల్, సన్‌క్రాస్ అనే రెండు బ్రాండ్‌లు ఉన్నాయి. దీని తర్వాత అత్యధికంగా అమ్ముడైన హెగ్డే & హెగ్డే బ్రాండ్ సన్‌బాన్ నిలిచింది. కరోనాకి ముందు కాలంలో కూడా సన్‌స్క్రీన్ విక్రయాల్లో ఇదే జోరు కనిపించిందని కంపెనీలు చెబుతున్నాయి.

English summary

Sunscreen Sales: రికార్డు స్థాయిలో సన్‌స్క్రీన్‌ల అమ్మకాలు.. 55 శాతం ఎక్కువగా.. కారణమేంటంటే.. | medicated sunscreen sales increased rapidly in india by 55 percent and having 300 crores market

medicated sunscreen sales increased rapidly after covid in india know why..
Story first published: Wednesday, July 6, 2022, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X