For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ ఎస్టేట్ రంగానికి మరో 6 నెలల పాటు ఊరట

|

కరోనా మహమ్మారి-లాక్ డౌన్‌తో చితికిపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. నిర్మాణ, సేవల కాంట్రాక్టులకు ఆరు నెలల వరకు వెసులుబాటు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మనిర్భర్ భాత్ అభియాన్ వివరాలను నిర్మల వెల్లడించారు. కేంద్రం ఏజెన్సీల కాంట్రాక్టు పనుల పూర్తికి ఆరు నెలల అదనపు సమయం ఇస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు కాంట్రాక్టర్ల బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేయవచ్చునని తెలిపారు. పనులు పూర్తయిన స్థాయిని బట్టి బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేయాలన్నారు. ఈ వెసులుబాటు వల్ల కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత కొరత కొంత వరకు తగ్గుతుందని తెలిపారు.

కంపెనీలకు పీఎఫ్ చెల్లింపుపై భారీ ఊరట, మరో 3 నెలలు కేంద్రమే చెల్లిస్తుందికంపెనీలకు పీఎఫ్ చెల్లింపుపై భారీ ఊరట, మరో 3 నెలలు కేంద్రమే చెల్లిస్తుంది

కరోనా సమయాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్‌గా చూడాలని నిర్మల తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు ఒప్పందాల అమలుకు సంబంధించి మార్పులు సూచిస్తున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు కూడా ఈ సందర్భంగా భారీ ఊరట కల్పించిన విషయం తెలిసిందే.

 measures announced by FM Nirmala Sitharaman for real estate sector

ఎంఎస్ఎంఈలకు 12 నెలల మారటోరియంతో రూ.3 లక్షల కేటాయించినట్లు తెలిపారు. నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. తద్వారా ఎంఎస్ఎంఈ ఉద్యోగులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలలో ఈక్విటీ పెట్టుబడుల కోసం రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. శక్తి, సామర్థ్యం, ఉన్న ఎంఎస్ఎంఈలతో పాటు ఎన్పీఏ ముప్పు ఎదుర్కొనే సంస్థలు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అలాగే రూ.200 కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్స్ అవకాశం లేదని తెలిపారు.

English summary

రియల్ ఎస్టేట్ రంగానికి మరో 6 నెలల పాటు ఊరట | measures announced by FM Nirmala Sitharaman for real estate sector

Finance Minister Nirmala Sitharaman on May 13 announced a slew of measures as a part of the economic package announced by Prime Minister Narendra Modi during his address to the nation on May 12.
Story first published: Wednesday, May 13, 2020, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X