For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరిం భారం కానున్న మారుతీ కార్లు, పెంపుకు కారణమిదే

|

దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అన్ని మోడల్స్ ధరలను పెంచుతామని వెల్లడించింది. ఉక్కుతో పాటు వాహన తయారీలో కీలకమైన వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగాయని, అందుకే ధరల పెంపు తప్పడం లేదని మారుతీ సుజుకీ సంస్థ సేల్స్, మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

ఇంతకుముందు ఏప్రిల్ నెలలో వాహన ధరలు పెంచింది మారుతీ. ఆల్టో నుండి ఎస్ క్రాస్ వరకు వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. ఢిల్లీ ఎక్స్-షోరూం ప్రకారం వీటి ధరల శ్రేణి కనిష్ఠంగా రూ.3 లక్షలు, గరిష్ఠంగా రూ.12.39 లక్షలుగా ఉన్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికం నుండి మరోసారి ధరలు పెంచుతున్నట్లు తెలిపింది.

Maruti Suzuki to hike car prices from September quarter

స్టీల్ సహా కార్ల ఉత్పత్తికి అవసరమైన పలు కమోడిటీ ధరలు గణనీయంగా పెరిగాయని, దీంతో కొంత భారాన్ని కస్టమర్ల పైకి బదిలీ చేయక తప్పడం లేదని మారుతీ చెబుతోంది. ఏ మోడల్ పైన ఎంత పెంచేదీ ఇంకా వెల్లడించలేదు. పెంపు పైన అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో కంపెనీ కార్ల ధరలు పెంచడం ఇది రెండోసారి.

English summary

మరిం భారం కానున్న మారుతీ కార్లు, పెంపుకు కారణమిదే | Maruti Suzuki to hike car prices from September quarter

Maruti Suzuki India said it will hike prices of its cars in the second quarter of the current fiscal due to increase in the input costs.
Story first published: Tuesday, June 22, 2021, 8:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X