For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

November auto sales: మారుతీ సుజుకీ సేల్స్ జంప్, కానీ తగ్గిన కారు అమ్మకాలు

|

మారుతీ సుజుకీ ఇండియా వాహనాల సేల్స్ నవంబర్ నెలలో పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన దేశీయ దిగ్గజ కారు మ్యానుఫ్యాక్చరర్ అమ్మకాలు 1.7 శాతం పెరిగి 1,53,223 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 1,50,630 యూనిట్లు విక్రయించారు. అయితే అంచనా వేసిన 1.63 లక్షల యూనిట్ల కంటే తక్కువే ఉన్నాయి. ఇందులో డొమెస్టిక్ సేల్స్ 1,38,956గా ఉన్నాయి. నవంబర్ నెలలో మొత్తం ఎగుమతులు 29.7 శాతం (9,004 యూనిట్లు) పెరిగాయి. 2019 నవంబర్ ఎగుమతులు 6,744గా నమోదయ్యాయి. మారుతీ సుజుకీ మొత్తం సేల్స్ పెరిగినప్పటికీ, కారు సేల్స్ మాత్రం తగ్గాయి.

FY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీFY20 ITR forms: ఐటీఆర్ ఫామ్‌లో ఈ ఏడాది కీలక మార్పులు.. ఇవీ

కారు సేల్స్ మాత్రం తగ్గాయి

కారు సేల్స్ మాత్రం తగ్గాయి

మారుతీ సుజుకీ పాసింజర్ కారు సేల్స్ ఏడాది ప్రాతిపదికన 2.4 శాతం క్షీణించి 139,133 (నవంబర్ 2019) నుండి ఈ నవంబర్‌లో 135,775 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన కంపైనీ లైట్ కమర్షియల్ వెహికిల్ సేల్స్ 40.3 శాతం పెరిగాయి. 2019 నవంబర్‌లో 2,267 యూనిట్లు కాగా, ఈ నవంబర్‌లో 3,181 యూనిట్లుగా ఉన్నాయి. అక్టోబర్ నెలలో మారుతీ సుజుకీ సేల్స్ రికార్డ్ స్థాయిలో 1,63,656 యూనిట్లుగా నమోదయ్యాయి. వరుస నెలల్లో కారు సేల్స్ ఆశాజనకంగా ఉండటంతో మారుతీ సుజుకీ స్టాక్ ధర నేడు 0.64 శాతం లాభపడి రూ.7,076 వద్ద ట్రేడ్ అయింది.

ఈ సేల్స్ పెరిగాయి

ఈ సేల్స్ పెరిగాయి

మారుతీ సుజుకీ బలమైన విక్రయాలు నమోదు చేసే మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ సేల్స్ 5.1 శాతం క్షీణించాయి. వీటి సేల్స్ 1,04,319 యూనిట్ల నుండి 98,969 యూనిట్లకు పరిమితమయ్యాయి. మిడ్ కారు సైజ్ సేల్స్ మాత్రం 29 శాతం పెరిగి 1448 నుండి 1870గా నమోదయ్యాయి. వ్యాన్, యుటిలిటీ సేల్స్ పెరిగాయి. ఎర్టిగా వెహికిల్ క్లస్టర్ సేల్స్ 24వేల దిగువనే ఉన్నాయి. ఓమ్నీ, ఈకో సేల్స్ 10 శాతం పెరిగి 11,183 యూనిట్లుగా ఉన్నాయి.

బజాజ్ ఆటో సేల్స్ జంప్

బజాజ్ ఆటో సేల్స్ జంప్

బజాజ్ ఆటో సేల్స్ ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగాయి. 2019 నవంబర్ నెలలో బైక్ సేల్స్ 3.43 లక్షలు కాగా, గత నెలలో (నవంబర్) 3.85 లక్షలకు పెరిగాయి. మొత్తం 3,84,993 యూనిట్లలో 1,88,196 డొమెస్టిక్, 1,96,797 ఎక్స్‌పోర్ట్ సేల్స్ ఉన్నాయి. డొమెస్టిక్ టూ వీలర్ సేల్స్ 7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఎగుమతులు 18 శాతం పెరిగాయి.

English summary

November auto sales: మారుతీ సుజుకీ సేల్స్ జంప్, కానీ తగ్గిన కారు అమ్మకాలు | Maruti Suzuki November auto sales rise 1.7 percent YoY to 153,223 units

Maruti Suzuki India, the largest passenger car manufacturer in the country, reported a 1.7 percent on-year rise in total sales for the month of November 2020 helped by a robust jump in exports.
Story first published: Tuesday, December 1, 2020, 14:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X