For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2019లో ఇప్పటి వరకు సేల్ అయిన టాప్ సెడాన్ కారు ఇదే

|

2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ - నవంబర్) మధ్య దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు మారుతీ సుజుకీకి చెందిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కార్లు. గత కొన్ని నెలలుగా ఆటో ఇండస్ట్రీ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. కార్లు, బైక్స్, ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ భారీగా పడిపోయాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం ఉద్దీపన చర్యలతో క్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మందగమన సమయంలోను డిజైర్ కార్లకు డిమాండ్ బాగానే ఉంది.

మారుతీ సుజుకీ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో 1.2 లక్షల యూనిట్లు సేల్ అయ్యాయి. కాంప్యాక్ట్ సెడాన్ విభాగంలో 60% వాటాతో తొలి స్థానంలో నిలిచినట్లు మారుతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.

Tourist spot: భారతీయులు ఎక్కువగా చూసిన సిటీ హైదరాబాద్,దుబాయ్Tourist spot: భారతీయులు ఎక్కువగా చూసిన సిటీ హైదరాబాద్,దుబాయ్

 Maruti Suzuki Dzire countrys best selling car in April top November

వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ కారులో వివిధ మార్పులు చేశామని, దీంతో సేల్స్‌లో ముందుందని చెప్పారు. మే 2017లో మూడో జనరేషన్‌గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కారు ఇప్పటికే 20 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఒక్క 2018-19లోనే 2.5 లక్షల కార్లు అమ్ముడుపోయాయి.

స్విఫ్ట్ డిజైర్ తొలి తరం మోడల్ 2008లో మార్కెట్లోకి వచ్చింది. అనంతరం కొన్ని మార్పులతో 2012లో రెండోతరం రోడ్లపైకి ప్రవేశించింది. ఇప్పుడు మూడోతరం డిజైర్ కార్లు 2017లో వచ్చాయి.

English summary

2019లో ఇప్పటి వరకు సేల్ అయిన టాప్ సెడాన్ కారు ఇదే | Maruti Suzuki Dzire country's best selling car in April top November

Maruti Suzuki India (MSI) on Tuesday said its compact sedan Dzire has become the best selling car in the country in the first eight months of the current fiscal with sales of over 1.2 lakh units.
Story first published: Wednesday, December 25, 2019, 10:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X