For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.603 కోట్లు నష్టపోయిన బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ 'బేర్'

|

భారత్ సహా ప్రపంచ మార్కెట్లు కరోనా దెబ్బకు బేర్‌మంటున్నాయి. ఆసియాలో కుబేరుడు ముఖేష్ అంబానీ ఈ దెబ్బకు రూ.1 లక్ష కోట్లకు పైగా సంపద పోగొట్టుకొని రెండో స్థానానికి పడిపోయారు. రిలయన్స్, హెచ్‌డీఎప్‌సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐటీసీ, కొటక్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ వంటి దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో నష్టపోయాయి. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయి. కరోనా చిన్న పెట్టుబడిదారు మొదలు పెద్ద పెట్టుబడిదారు వరకు.. అందరికీ నష్టాలను మిగిల్చింది. బిలియనీర్ ఇన్వెస్టర్, ట్రేడర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా భారీగానే నష్టపోయారు.

రూ.603 కోట్లు నష్టపోయిన ఝున్‌ఝున్‌వాలా

రూ.603 కోట్లు నష్టపోయిన ఝున్‌ఝున్‌వాలా

రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టి చాలా వరకు కంపెనీల షేర్లు 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. ఇవి 20 శాతం నుండి 80 శాతం మేర కుప్పకూలాయి. దీంతో ఆయనసంపద దాదాపు రూ.603 కోట్లు హరించుకుపోయింది. రాకేష్, ఆయన సతీమణి రేఖ సంపాదన కలిసి పెద్ద మొత్తంలోనే నష్టపోయారు.

25 శాతం పడిపోయిన టైటాన్ షేర్

25 శాతం పడిపోయిన టైటాన్ షేర్

టైటాన్ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు, అతని సతీమణి రేఖకు డిసెంబర్ 2019 నాటికి 6.69 శాతం వాటాలు ఉన్నాయి. రాకేష్‌కే స్వయంగా 5.27 శాతం ఉన్నాయి. టైటాన్‌లో రూ.6500 కోట్లు, లుపిన్‌లో రూ.400 కోట్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. టైటాన్ షేర్ గురువారం 9.31 శాతం పడిపోయి రూ.1,078కి చేరుకుంది. 52 వారాల గరిష్టస్థాయి రూ.1,389తో పోలిస్తే 25 శాతం పడిపోయింది.

రూ.300 పెట్టుబడి రూ.170 కోట్లకు పడిపోయింది

రూ.300 పెట్టుబడి రూ.170 కోట్లకు పడిపోయింది

ఇక లుపిన్ షేర్ కూడా 52 వారాల కనిష్టానికి పడిపోయింది. దాదాపు 32 శాతం నష్టపోయింది. వీఐపీ ఇండస్ట్రీస్ గురువారం రూ.335కి చేరుకుంది. గత ఏడాది గరిష్టస్థాయి నుండి ఏకంగా 35 శాతం నష్టపోయింది. దీంతో కొద్ది నెలల కిందట రూ.300 కోట్లుగా ఉన్న రాకేష్ పెట్టుబడులు ఇందులో ఇఫ్పుడు రూ.170 కోట్లకు పడిపోయాయి.

ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ నష్టాల్లోనే..

ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ నష్టాల్లోనే..

మాన్ ఇన్ఫ్రా, బిల్‌కేర్, యాప్ టెక్, టీవీ 18 బ్రాడ్‌కాస్ట్, డెల్టా కార్ప్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్.. ఇలా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన షేర్లన్నీ నష్టపోయాయి. ఇంకా చెప్పాలంటే బేర్‌లో ఉన్నాయి. మందానా రిటైల్ వెంచర్స్, డీబీ రియాల్టీ, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ఎన్సీసీ వంటి కంపెనీలు ఏడాది గరిష్టాల నుండి 70 శాతం నుండి 85 శాతానికి పడిపోయాయి. అయితే కరోనా దెబ్బకు ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీలనే కాదు.. దాదాపు అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి.

English summary

రూ.603 కోట్లు నష్టపోయిన బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ 'బేర్' | Markets crash: Rakesh Jhunjhunwala loses Rs 603 crore

Jhunjhunwala and his wife, Rekha have a combined stake of 6.69 percent in Tata Company as of December 2019.
Story first published: Friday, March 13, 2020, 9:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X