For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చివరలో మురిసిన ఇన్వెస్టర్లు: అమెరికా ఎఫెక్ట్, భారీ నష్టాలతో భారీ కొనుగోళ్లు..

|

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం కోలుకున్నాయి. వరుసగా ఆరు సెషన్‌లలో నష్టపోయిన మార్కెట్లు ఈ రోజు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 240 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ రోజు మార్కెట్ ర్యాలీకి పలు కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ప్రధానంగా అమెరికా టెక్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిశాయి. భారత మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభమై, ఆద్యంతం లాభాల్లోనే ట్రేడ్ అయి, వారాంతంలో ఇన్వెస్టర్లను మురిపించాయి. మార్కెట్ ర్యాలీకి కారణం...

రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఎఫెక్ట్! నిన్నటి నష్టం 70% తిరిగి వచ్చిందిరిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఎఫెక్ట్! నిన్నటి నష్టం 70% తిరిగి వచ్చింది

వరుస నష్టాలు.. కొనుగోళ్లకు మొగ్గు

వరుస నష్టాలు.. కొనుగోళ్లకు మొగ్గు

స్టాక్ మార్కెట్లు గత ఆరు సెషన్‌లలో 2750 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో తక్కువ వ్యాల్యూ వద్ద కొనుగోళ్లు పెరిగాయి. నిన్నటి వరకు చాలా స్టాక్స్ పెద్ద మొత్తంలో క్షీణించాయి. తక్కువ వ్యాల్యూ వద్ద కొనుగోళ్లకు రిటైల్ ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు ఊతమిచ్చింది. నిన్నటి నష్టంతో పోలిస్తే మార్కెట్లు ఈ రోజు 70 శాతం తిరిగి రాబట్టగలిగింది. ఈరోజు లాభాలతో రూ.3.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తిరిగి వచ్చింది.

అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్

అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్

అమెరికా ఆర్థిక ప్యాకేజీపై నిన్నటి వరకు డైలమా కొనసాగింది. అయితే యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ పైన కసరత్తు చేస్తున్నారు. వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఉద్దీపన ప్యాకేజీకి డెమోక్రాట్లు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఇది కూడా మార్కెట్ పుంజుకోవడానికి కారణమైంది. దీంతో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే క్లోజ్ అయ్యాయి.

పెద్ద కంపెనీల స్టాక్స్ జూమ్

పెద్ద కంపెనీల స్టాక్స్ జూమ్

రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద స్టాక్స్ భారీ లాభాల్లో ముగిశాయి. దాదాపు మూడు శాతం వరకు లాభపడ్డాయి. ఆటో, ఐటీ స్టాక్స్ ఎగిశాయి. దీంతో నిఫ్టీ తిరిగి 11,000 దాటగా, సెన్సెక్స్ 37,000 మార్క్ దాటింది. రిలయన్స్ (0.81 శాతం), టీసీఎస్ (3.67 శాతం), ఇన్ఫోసిస్ (3.20 శాతం), విప్రో (3.02 శాతం),

టెక్ మహీంద్ర (3.01 శాతం), హెచ్‌సీఎల్ టెక్ (5.30 శాతం) లాభపడ్డాయి. ఐటీ స్టాక్స్ 3 శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి. ఇలా అతిపెద్ద వాటా కలిగిన రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి రంగాలు భారీగా లాభపడటంతో మంచి లాభాలను చూశాయి.

English summary

చివరలో మురిసిన ఇన్వెస్టర్లు: అమెరికా ఎఫెక్ట్, భారీ నష్టాలతో భారీ కొనుగోళ్లు.. | Market snaps 6 day losing streak: Top factors behind market rally

Sensex and Nifty closed 2.2% higher each Friday's trading session, backed by positive global equities that were optimistic on renewed hopes of fiscal stimulus from the US.
Story first published: Friday, September 25, 2020, 18:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X