For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో ప్రారంభమై, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూలై 12) భారీ లాభాల్లో ప్రారంభమై, చివరకు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 2180 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ, చివరలో కాస్త కోలుకొని 13 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ మాత్రం దాదాపు మూడు పాయింట్ల లాభంలో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ ఆరు పైసలు ఎగబాకి 74.58 వద్ద ముగిసింది. ఓ సమయంలో 21 పైసలు పెరిగింది.

ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ 0.5 శాతం క్షీణించడంతో సూచీలు కిందకు పడిపోయాయి. దీంతో టెల్కో, ఐటీ, విద్యుత్ రంగాలు సహా టాటా స్టీల్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, HDFC, టీసీఎస్, HUL సహా కీలక షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 52,700 వద్ద గరిష్ఠాన్ని తాకింది. సూచీ తిరిగి 52,208 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 15,789.20 వద్ద గరిష్టాన్ని, 15,644.75 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్

Market ends flat amid volatility: IT, Metals drag

. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 13 పాయింట్లు నష్టపోయి 52,372 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 02 పాయింట్ల స్వల్ప లాభంతో 15,692 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.57 వద్ద నిలిచింది.

English summary

భారీ లాభాల్లో ప్రారంభమై, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Market ends flat amid volatility: IT, Metals drag

On the sectoral front, realty index added 3.5 percent, while selling was seen in the IT, metal, oil & gas and power indices. BSE midcap and smallcap indices ended in the green.
Story first published: Monday, July 12, 2021, 19:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X