For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వావ్.. టాటా మోటార్స్ సేల్స్ 500% జంప్ఛ అదరగొట్టిన ఆటో సేల్స్.. కానీ

|

కరోనా ప్రారంభంలో ఓ సమయంలో దాదాపు జీరోస్థాయికి పడిపోయిన వాహనాల సేల్స్ క్రమంగా పుంజుకుంటున్నాయి. కరోనా భయాలతో ఎక్కువ మంది సొంత వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బైక్, కారు సేల్స్ పెరుగుతున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల డిమాండ్ కూడా పెరిగింది. వాహన తయారీ అగ్రగామి సంస్థలు మారుతీ, హ్యుండాయ్, టాటా మోటార్స్ వాహనాల సేల్స్ భారీగా పెరిగాయి. ప్రధానంగా ఈ నెల నుండి ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో చాలామంది మార్చి నెలలోనే కొనుగోలు చేశారు. దాదాపు అన్ని కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి. సుజుకీ మోటార్ వాహనాల సేల్స్ మాత్రం తగ్గాయి.

నెల ప్రాతిపదికన డౌన్, ఏడాది ఐతే జంప్

నెల ప్రాతిపదికన డౌన్, ఏడాది ఐతే జంప్

టూవీలర్ మేకర్ బజాజ్ ఆటో లిమిటెడ్ సేల్స్ మార్చి నెలలో ఫిబ్రవరి నెలతో పోలిస్తే 1.5 శాతం క్షీణించి 3,69,448 యూనిట్లు అమ్ముడు పోయాయి. అంతకుముందు నెలలో 3,75,017 యూనిట్లు సేల్ అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 52 శాతం పెరిగాయి. కరోనా కారణంగా గత ఏడాది సేల్స్ భారీగా తగ్గాయి. డొమెస్టిక్ సేల్స్ దాదాపు రెండింతలు పెరిగి 1,81,393 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 32 శాతం పెరిగి 1,48,740 యూనిట్లుగా ఉంది. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 24 శాతం పెరిగి 39,315 యూనిట్లుగా ఉంది.

సుజుకీ మోటార్ సైకిల్ సేల్స్ 2.4 శాతం క్షీణించి 69,942 యూనిట్లకు తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన సేల్స్ 72 శాతం పెరిగాయి.

హోండా మోటార్ సేల్స్ నెల ప్రాతిపదికన అంటే ఫిబ్రవరితో పోలిస్తే 7 శాతం పడిపోయాయి. ఏడాది ప్రాతిపదికన 57 శాతం పెరిగి 4,11,037 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 2,61,699 యూనిట్లు సేల్ అయ్యాయి.

టీవీఎస్, హీరో మోటో కార్ప్ సేల్స్

టీవీఎస్, హీరో మోటో కార్ప్ సేల్స్

టీవీఎస్ మోటార్ కంపెనీ సేల్స్ ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో 8.3 శాతం పెరిగి 3,22,683 యూనిట్లకు పెరిగాయి. ఫిబ్రవరి నెలలో ఈ కంపెనీ 2,97,747 యూనిట్లు విక్రయించింది.

హీరో మోటో కార్ప్ మార్చి నెలలో 5.77 లక్షల యూనిట్లను విక్రయించింది. ఏడాది ప్రాతిపదికన హీరో మోటో కార్ప్ సేల్స్ 72 శాతం ఎగిశాయి. మోటార్ సైకిల్ సేల్స్ గత ఏడాది 3,05,932 యూనిట్లు కాగా, ఈ మార్చిలో 5,24,608 యూనిట్లుగా నమోదయ్యాయి. స్కూటర్ సేల్స్ దాదాపు రెండింతలు పెరిగి 523,49 యూనిట్లకు పెరిగాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ ఫిబ్రవరితో పోలిస్తే 5 శాతం తగ్గాయి.

ఎంజీ మోటార్ సేల్స్ భారీగా పెరిగాయి. ఓ నెలలో అత్యధిక సేల్స్ రికార్డును మార్చిలో నమోదు చేసింది.

అశోక్ లేలాండ్ సేల్స్ 17,231 యూనిట్లు.

టాటా మోటార్స్ సేల్స్ 500 శాతం జంప్

టాటా మోటార్స్ సేల్స్ 500 శాతం జంప్

టాటా మోటార్స్ డొమెస్టిక్ సేల్స్ మార్చి 2021లో 505 శాతం ఎగిశాయి. గత ఏడాది మార్చి నెలలో సేల్స్ 11,012 కాగా, ఈసారి 66,609కి చేరుకున్నాయి. కంపెనీ పాసింజర్ వెహికిల్ సేల్స్ నెల ప్రాతిపదికన 5,676 యూనిట్ల నుండి 29,654 యూనిట్లకు పెరిగాయి. గత తొమ్మిదేళ్లలోనే పీవీ విక్రయాల్లో గరిష్టాన్ని నమోదు చేసింది.

English summary

వావ్.. టాటా మోటార్స్ సేల్స్ 500% జంప్ఛ అదరగొట్టిన ఆటో సేల్స్.. కానీ | March Auto Sales: MotoCorp's Sales Surge, Tata Motors sales jump 500 percent

Two-wheeler maker, Bajaj Auto Ltd sold a total of 3,69,448 units in March, that's a fall of 1.5% over last month's sale of 3,75,017 units. Year-on-Year, the sales rose 52% on a low base due to covid disruption and BS6 transition last year.
Story first published: Friday, April 2, 2021, 12:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X