For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Viral News: అనుకోకుండా ఉద్యోగి ఖాతాలో 286 నెలల జీతం.. ఉద్యోగి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..

|

Salary Credited: ఉద్యోగి నెలంతా పనిచేసేది జీతం కోసమే. బోనస్ పడితేనే పండగ అనుకునే వారికి పొరపాటున 23 సంవత్సరాల జీతం ఒక్కసారిగా వస్తే ఏం జరుగుతుంది. ఇది జోక్ అస్సలు కాదు నిజమే. ఒక ఉద్యోగికి అనుకోకుండా ఒకేసారి 286 నెలల జీతం అకౌంట్ లో పడింది. ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ, ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువే అయినప్పటికీ అలాంటి ఉదంతం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన చిలీలో చోటుచేసుకుంది. ఒక కంపెనీ పొరపాటున 286 నెలల జీతాన్ని తన ఉద్యోగుల్లో ఒకరి ఖాతాకు ఒకేసారి పంపింది. ఈ ఘటన పోయిన నెలలో జరిగింది.

తిరిగి వస్తానని చెప్పి..

తిరిగి వస్తానని చెప్పి..

ఇక్కడ తమాషా ఏంటంటే.. డబ్బు తిరిగి ఇచ్చేస్తానని సదరు ఉద్యోగి మొదట కంపెనీకి హామీ ఇచ్చినా.. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఈ తప్పును గుర్తించిన కంపెనీ ఉద్యోగిని సంప్రదించింది. ఉద్యోగి తనకు అదనంగా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తానని కంపెనీకి సమాదానమిచ్చాడు. అయితే ఆ ఉద్యోగి తన మాటను నిలబెట్టుకోలేదు.

కోట్లాది రూపాయలు..

కోట్లాది రూపాయలు..

నివేదికల ప్రకారం.. ఈ సంఘటన కన్సోర్సియో ఇండస్ట్రియల్ డి అలిమెంటోస్ (CIAL) కంపెనీలో జరిగింది. ఇది చిలీలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. మే నెలలో కంపెనీ పొరపాటున ఒక ఉద్యోగికి 5 లక్షల పెసోలకు బదులుగా 16.54 కోట్ల పెసోలు అంటే దాదాపు మన కరెన్సీ ప్రకారం రూ.1.42 కోట్లను జమచేసింది. కంపెనీ యాజమాన్యం రికార్డులను తనిఖీ చేయగా ఈ తప్పు బయటపడింది.

డబ్బుకు బదులుగా..

డబ్బుకు బదులుగా..

పొరపాటును గుర్తించిన తర్వాత కంపెనీ యాజమాన్యం ఆ ఉద్యోగితో మాట్లాడింది. పొరపాటున ఏకంగా 286 నెలల జీతాన్ని పంపినట్లు కంపెనీ తెలిపింది. దీని తర్వాత ఉద్యోగి బ్యాంకుకు వెళ్లి అదనపు డబ్బును తిరిగి ఇవ్వడం గురించి మాట్లాడాడు. దీంతో కంపెనీ వేచి చూసింది. డబ్బుకు బదులుగా ఉద్యోగి జూన్ 02 రాజీనామాను పంపటంతో కంపెనీ ఒక్కసారిగా ఖంగుతింది.

చట్టపరమైన చర్యలు ప్రారంభించిన కంపెనీ..

చట్టపరమైన చర్యలు ప్రారంభించిన కంపెనీ..

ఉద్యోగి రాజీనామా పంపటంతో కంపెనీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే సదరు ఉద్యోగి ప్రస్తుతం అదృశ్యమయ్యాడు. దీంతో కంపెనీ తన డబ్బును తిరిగి పొందేందుకు ఇప్పటికే ప్రభుత్వ అధికారులను సంప్రదించింది. సదరు ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకునే మార్గాన్ని కంపెనీ తీసుకుంది. అయితే చివరికి ఈ విషయం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి. కంపెనీ తన డబ్బును తిరిగి పొందుతుందో లేదో.

English summary

Viral News: అనుకోకుండా ఉద్యోగి ఖాతాలో 286 నెలల జీతం.. ఉద్యోగి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. | man got credited 286 months salary in chile gave shock to company with resignation and went missing news going viral

employees got 286 months salary from company by mistake gave shock to company
Story first published: Wednesday, June 29, 2022, 11:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X