For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వార్నీ.. ‘గూగుల్’నే తప్పుదోవ పట్టించాడు!

|

మనం సాధారణంగా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు అక్కడికి చేరుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడం కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయిస్తుంటాం. మన స్మార్ట్‌ఫోన్‌లోని గుగల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేసి, మనం వెళ్లాలనుకున్న ప్రదేశం వివరాలు టైప్ చేసి, ఆ తరువాత అది చూపించిన మార్గంలో ప్రయాణిస్తుంటాం.

స్మార్ట్‌ఫోన్లలోని లొకేషన్ మోడ్ ఆధారంగా గూగుల్.. కార్లు, ఇతర వాహనాల కదలికల సమాచారాన్ని సేకరించి.. ఆ సమయంలో, ఆ ప్రాంతంలో ఎన్ని వాహనాలు ఉన్నాయో, అవి ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయో గూగుల్ మ్యాప్స్‌లో చూపిస్తుంది. అంతేకాదు, వాహనాల రద్దీని పసిగట్టి ఆ సమయంలో, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఉన్నట్లు కూడా మనకు చూపిస్తుంది.

man creates fake traffic jam in google maps

ఇలా మనం ప్రయాణించే ప్రాంతంలో కచ్చితమైన ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్ మనకు చూపిస్తూ.. ఒకవేళ ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అయి ఉన్నట్లయితే ఆ విషయాన్ని ముందుగానే మనకు తెలియజేస్తుంది. అలాంటప్పుడు ఆ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనకు చూపిస్తుంది.

ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఓ వ్యక్తి ఏకంగా గూగుల్ మ్యాప్స్‌నే బోల్తా కొట్టించాడు. జర్మనీ రాజధాని బెర్లిన్‌కు చెందిన సైమన్ వెకెర్ట్ అనే వ్యక్తి స్వతహాగా ఆర్టిస్ట్. అతడొక వినూత్న ప్రయోగం చేశాడు. దీనికోసం 99 స్మార్ట్‌ఫోన్లను అతడు ఉపయోగించాడు.

సైమన్ వెకెర్ట్ ఆ స్మార్ట్‌ఫోన్లు అన్నింటిలోనూ లోకేషన్ ఆప్షన్‌ను ఆన్ చేసి, వాటిని ఓ చిన్న ట్రాలీలో ఉంచి, ఆ ట్రాలీని మెల్లగా లాక్కుంటూ బెర్లిన్ నగరంలోని రోడ్ల వెంట తిరిగాడు. గూగుల్ కార్యాలయం ఉన్న వీధితో సహా అన్ని ప్రదేశాలకు తిరిగాడు.

అలా సైమన్ ఆ ట్రాలీని లాక్కుంటూ నెమ్మదిగా రోడ్లపై తిరుగుతుండగా.. ఆ 99 స్మార్ట్‌ఫోన్లలోని లొకేషన్ మోడ్ ఆధారంగా ఆ రోడ్లపై ఎక్కువ వాహనాలు తిరుగుతున్నట్లు గూగుల్ మ్యాప్స్ భావించి.. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్లు గుగుల్ మ్యాప్‌లో ఎరుపు రంగు మార్కును కూడా చూపించింది.

నిజానికి ఆ సమయంలో ఆ రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. కానీ 99 స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ మోడ్ ఆన్‌లో ఉండడం, పైగా అవి మెల్లగా కదులుతుండడంతో వాటిని వాహనాలుగా గుగుల్ మ్యాప్స్ భావించడమేకాక.. ఆ సమయంలో అక్కడ చాలా వాహన రద్దీ ఉన్నట్లు భ్రమపడింది.

ఇలా సైమన్ వెకెర్ట్ మొత్తానికి గుగుల్‌నే తప్పుదోవ పట్టించాడు. పైగా ఈ తతంగాన్నంతా అతడు వీడియో తీసి యూట్యూబ్‌లో కూడా ఉంచాడు. ఈ ప్రయోగం తరువాత గుగుల్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ.. ఈ ప్రయోగం నిజమే గనుక అయితే వెంటనే గూగుల్ ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని మాత్రం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read more about: google గూగుల్
English summary

వార్నీ.. ‘గూగుల్’నే తప్పుదోవ పట్టించాడు! | man creates fake traffic jam in google maps

One day in Berlin, Google Maps showed the red line denoting bumper-to-bumper traffic on several ordinarily calm streets, even though there was no special event taking place. Or anything happening on those streets, actually. The culprit: one man slowly walking around the city pulling a red wagon.
Story first published: Wednesday, February 5, 2020, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X