For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అగ్రరాజ్యాల నుండి మొదలు పెడితే ప్రతి దేశం వృద్ధి రేటు దశాబ్దాల కనిష్టానికి పతనమవుతోంది. అమెరికా, సింగపూర్, ఇటలీ, బ్రిటన్.. ఇలా అన్ని దేశాలు కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయాయి. తక్కువ జనాభా కలిగిన ధనిక దేశం మలేషియా వృద్ధి రేటు కరోనా కారణంగా దారుణంగా పతనమైంది.

నియామకాలు నిలిపివేసిన టిక్‌టాక్, సేల్ టాక్స్.. ఉద్యోగుల్ని నిలుపుకునే యత్నంనియామకాలు నిలిపివేసిన టిక్‌టాక్, సేల్ టాక్స్.. ఉద్యోగుల్ని నిలుపుకునే యత్నం

దీంతో అత్యంత దారుణ పతనం

దీంతో అత్యంత దారుణ పతనం

2020 క్యాలెండర్ ఇయర్ రెండో క్వార్టర్‌లో మలేషియా వృద్ధిరేటు అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1 శాతం క్షీణించింది. 20 ఏళ్లలో ఇది అత్యంత దారుణ పతనం. స్వదేశం, విదేశాల్లో కఠినమైన కరోనా వైరస్ ఆంక్షలు లేదా లాక్ డౌన్‌లు, తగ్గిన వినియోగ వ్యయం, దెబ్బతీసిన ఎగుమతులతో మలేషియా ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా దెబ్బతిన్నది. వినియోగం తగ్గి, ఎగుమతులు పడిపోవడంతో వృద్ధి రేటు మందగించిందని కేంద్ర బ్యాంకు శుక్రవారం తెలిపింది.

ఆ ఆర్థిక సంక్షోభాల తర్వాత..

ఆ ఆర్థిక సంక్షోభాల తర్వాత..

అంతకుముందు ఆర్థిక నిపుణులు మలేషియా వృద్ధిరేటులో క్షీణత 10 శాతం వరకు ఉంటుందని భావించారు. కానీ దాదాపు రెండింతలు పతనమైంది. మొదటి క్వార్టర్‌లో వృద్ధి రేటు 0.7 శాతం మాత్రమే మందగించింది. దీంతో పది శాతం ఉంటుందని అంచనా వేశారు. 2009లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత మరోసారి ఈస్థితిలో పతనమైంది. 1998లో సంక్షోభం సమయంలో 11.2 శాతం క్షీణించింది.

కోలుకుంటాం..

కోలుకుంటాం..

2020 క్యాలెండర్ ఇయర్‌లో తొలి అర్థభాగం వృద్ధిరేటు దారుణంగా దెబ్బతిన్నదని, రెండో అర్ధ సంవత్సరంలో కోలుకుంటుందని బ్యాంక్ నెగారా మలేషియా గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. రెండో అర్ధ సంవత్సరంలో బాగా పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కరోనా ఒత్తిళ్ల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడిందని చెప్పారు. కాగా రెండో క్వార్టర్ తర్వాత నుండి మిగతా ఏడాది మలేషియా వృద్ధి 3.5 శాతం నుండి 5.5 శాతం, 5.5 శాతం నుండి 8 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జూన్ నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు 4.9 శాతంగా ఉంది.

English summary

20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ | Malaysias economy shrinks 17.1 percent, worst contraction in over 20 years

Malaysia’s economy shrank by 17.1% in the second quarter from a year earlier, its worst contraction in over two decades, as strict coronavirus measures at home and abroad slammed consumer spending and exports, the central bank said on Friday.
Story first published: Friday, August 14, 2020, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X