For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'కమర్షియల్' దారిలోనే డొమెస్టిక్ గ్యాస్ ధర? కాస్త ఊరట.. పరుగు ఆపిన క్రూడ్..

|

దీపావళి పర్వదినంకు ముందు కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.266 పెరింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఏకంగా 85 డాలర్లకు సమీపంలో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 83 డాలర్లకు పైన ఉంది. గత శుక్రవారం ఒక్కరోజే 6 సెంట్లు లాభపడింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 83 డాలర్ల వద్ద ఉంది. గత శుక్రవారం 76 సెంట్లు ఎగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశీయ ఇంధన మార్కెట్ పైన పడి, సామాన్యుడిపై భారం పడుతోంది.

కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు

కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు

హోటల్స్, రెస్టారెంట్లలో వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నవంబర్ 1న రూ.266 పెరిగింది. తాజా పెరుగుదలతో వివిధ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.2000.50గా ఉంది. అంతకుముందు రూ.1734 వద్ద ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర ముంబైలో రూ.1,950, కోల్‌కతాలో రూ.2,073.50, చెన్నైలో రూ.2,133గా ఉంది. ముంబైలో అంతకుముందు రూ.1,683గా ఉంది. దేశీయ చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు అంతకుముందు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) ధరను అక్టోబర్ 6వ తేదీన రూ.15 పెంచాయి. 14.2 కిలోల నాన్-సబ్సిడీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.899, ఐదు కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.502గా ఉంది.

వంట గ్యాస్ ధర కూడా పెరిగేనా?

వంట గ్యాస్ ధర కూడా పెరిగేనా?

అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి నెలా 1వ తేదీన, 15వ తేదీన గ్యాస్ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు సవరిస్తాయి. ఇందులో భాగంగా తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. వంట గ్యాస్ ధరను కూడా పెంచాలని భావిస్తున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడంతో సిలిండర్ పైన రూ.100 నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ధరలు పెంచక తప్పడం లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు వంట గ్యాస్ ధర రూ.205 పెరిగి సిలిండర్ రూ.1000కి చేరుకుంది. గత నెల ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధరను పెంచిన చమురురంగ సంస్థలు, ఆరో తేదీన డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచాయి. దీంతో వంట గ్యాస్ ధర త్వరలో మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

కాస్త ఊరట... దక్కేనా

కాస్త ఊరట... దక్కేనా

అంతర్జాతీయంగా ఇంధన ధరలు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. అయితే చైనా గ్యాసోలైన్, డీజిల్ నిల్వలను విడుదల చేయడం, సులభతరం చేయడంతో క్రూడ్ ధరలు సోమవారం కాస్త తగ్గాయి. అయితే మేజర్ క్రూడ్ ప్రొడ్యూసర్స్ నవంబర్ 4న భేటీ అయి ఉత్పత్తిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మొన్నటి వరకు పరుగులు పెట్టిన క్రూడ్ ధర నేడు కాస్త నిలబడింది. బ్రెంట్ క్రూడ్ నేడు 0.6 శాతం లేదా 46 సెంట్లు క్షీణించి 83.26 డాలర్ల వద్ద ఉంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 64 సెంట్లు లేదా 0.8 శాతం క్షీణించి 82.93 డాలర్ల వద్ద ఉంది. అయితే చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని పెంచితే ధరలు శాంతిస్తాయి.

English summary

'కమర్షియల్' దారిలోనే డొమెస్టిక్ గ్యాస్ ధర? కాస్త ఊరట.. పరుగు ఆపిన క్రూడ్.. | LPG price rise: Commercial cooking gas cylinders gets costlier

After this hike, commercial cylinder price in Delhi crossed Rs 2,000 mark. Earlier, it was being sold at Rs 1,733.
Story first published: Monday, November 1, 2021, 15:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X