For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Price Hike: రూ.100కు పైగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

|

కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర డిసెంబర్ 1వ తేదీ నుండి రూ.100 పెరిగింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఒక్కో వంట గ్యాస్ సిలిండర్‌ రేటును రూ.103.50 పైసలు పెంచింది. ఈ కేటగిరీకి చెందిన ఎల్పీజీ వంటగ్యాస్‌ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గతనెల 1వ తేదీన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.266 పెంచింది. ఈ నెల మరో రూ.103.50 పెంచింది.

తాజా ధరల పెంపు అనంతరం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2,101, ముంబైలో రూ.2,051, కోల్‌కతాలో రూ.2,174.50 , చెన్నైలో రూ.2,234.50కి పెరిగింది. అంతకుముందు నవంబర్ 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. అంతకుముందు అక్టోబర్ 15న పెరిగింది. ఇక, 14.2 కిలోలు, 5 కిలోలు డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

 LPG Price Hike: Blow to LPG customers, gas becomes costlier by Rs 100

గృహ వినియోగదారులకు తాజా భారం నుంచి మినహాయింపు లభించింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల రేట్లను యధాతథంగా కొనసాగిస్తోంది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రెండు నెలల కాలంలో 19 కిలోల బరువు ఉండే వంటగ్యాస్‌పై రూ.369.50 పెరిగింది. ఈ ఏడాది మొదట్లో రూ.694 పలికిన గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.900 మార్క్‌ను దాటింది. కాగా, ఈ నెల 6వ తేదీన డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల ధరలను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

English summary

LPG Price Hike: రూ.100కు పైగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర | LPG Price Hike: Blow to LPG customers, gas becomes costlier by Rs 100

LPG prices for commercial cylinders were on Wednesday increased by Rs 103.50. The price rise will be effective from today onwards.
Story first published: Wednesday, December 1, 2021, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X