For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధర

|

వంట గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) ధర భారీగా పెరిగింది. తాజాగా రూ.50 పెరిగిన ఈ ధరలు ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయి. సవరించిన ధరల ప్రకారం 14.2 కిలోల సిలిండర్ గ్యాస్ ఢిల్లీలో రూ.769 ఉంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలు షాక్ ఇస్తున్నాయి. అదే దారిలో అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మూడు నెలల కాలంలోనే రూ.200 పెరిగింది.

డిసెంబర్ నుండి రూ.200 పెంపు

డిసెంబర్ నుండి రూ.200 పెంపు

ఫిబ్రవరి నెలలో ఎల్పీజీ ధర పెరగడం రెండోసారి. దీంతో గత మూడు నెలల్లో రూ.200 వరకు పెరిగింది. నేటి అర్ధరాత్రి నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు అదనంగా రూ.50 చెల్లించాలి. డిసెంబర్ నెలలో రెండు దఫాలుగా రూ.100, జనవరి నెలలో రూ.25 పెరిగింది. ఫిబ్రవరి నెలలో రెండు దఫాలుగా రూ.75 పెరిగింది. ఫిబ్రవరి 4న పెరిగిన ధరలు, తాజాగా మళ్లీ పెరిగాయి. ఓ వైపు పెట్రో ధరలు పెరుగుతుండగా, మరోవైపు గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు.

ఇక 15 రోజులకోసారి...

ఇక 15 రోజులకోసారి...

చమురు రంగ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయంగా ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా సవరిస్తాయి. గ్యాస్ ధరలను కూడా అలాగే పెంచేందుకు చమురు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని, దశల వారీగా పదిహేను రోజులకు ఓసారి కానీ, వారానికి ఓసారి కానీ ధరలు పెంచాలని యోచిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గత రెండు మూడు నెలలుగా పదిహేను రోజులకు ఓసారి సవరిస్తున్నాయి.

సబ్సిడీ సిలిండర్

సబ్సిడీ సిలిండర్

ఎల్పీజీ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. ప్రభుత్వం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 12 సబ్సిడీ పైన అందిస్తోంది. ఏడాదిలో 12 కంటే ఎక్కువ దాటితే సబ్సిడీ వర్తించదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్, నేచరల్ గ్యాస్ ధరలు ఇటీవల పెరుగుతున్నాయి.

English summary

LPG Cylinder Rates: 3 నెలల్లో రూ.200 పెరిగిన గ్యాస్ ధర | LPG Cylinder Rates: Cooking gas price hiked by Rs 200 in Three months

The price of Liquefied Petroleum Gas(LPG) domestic gas cylinder (14.2 kg) hiked by ₹50 per cylinder; to be at ₹769 per cylinder in Delhi from 12 am tomorrow, news agency ANI reported.
Story first published: Monday, February 15, 2021, 10:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X