అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా అనేక భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయాయి. ఈ పరిస్థితి భారతదేశ కార్గో భద్రత, సిబ్బంది రక్షణ, ఇంధన సరఫరాలపై ఆందోళనలను రేపింది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత జెండా ఉన్న దాదాపు 37 నౌకలు Hormuz ప్రాంతంలో చిక్కుకుని, రూ. 10 వేల కోట్లకు పైగా విలువైన షిప్పింగ్ ఆస్తులు పెరుగుతున్న భద్రతా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ నౌకల్లో ఎక్కువగా ముడి చమురు, LPG (ద్రవీకృత పెట్రోలియం వాయువు)ను రవాణా చేసే షిప్పులు ఉన్నాయి.
భారత జాతీయ నౌకా యజమానుల సంఘం (INSA) ఈ పరిస్థితిపై ప్రభుత్వ జోక్యాన్ని కోరుతూ.. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖలకు లేఖ రాసింది. నివేదిక ప్రకారం కీలకమైన నౌకా మార్గాన్ని బ్లాక్డ్ స్టైల్ క్లోజర్ గా వర్ణించడంతో ఓడలు చిక్కుకుపోయాయి. చైనా, ఇరానియన్ నౌకలు ఇంకా ఈ జలసంధి ద్వారా ప్రయాణిస్తున్నాయని.. భారత ఆపరేటర్లు సురక్షితంగా ప్రయాణించగలిగే స్థితి ఉందో లేదో స్పష్టత ఇవ్వాలని INSA ప్రభుత్వాన్ని కోరింది.

ఇందున భారత LPG దిగుమతుల 85 శాతం హార్ముజ్ జలసంధి గుండా వస్తుందనే పరిస్థితి. దీర్ఘకాలిక అంతరాయం జరిగినపుడు భారత ఇంధన సరఫరాకు సవాళ్లు రేకెత్తే అవకాశం ఉందని అసోసియేషన్ హెచ్చరించింది. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటికీ మూడు భారతీయ ట్యాంకర్లు దాడికి గురైన సంగతి.. ఒకటి క్షిపణి దాడి నుండి తప్పించుకోగలిగిన ఘట్టం కూడా ఈ నివేదికలో వెల్లడైంది.
లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ ప్రకారం అంతర్జాతీయంగా వ్యాపారం చేసే దాదాపు 200 ముడి, ఉత్పత్తుల ట్యాంకర్లు గల్ఫ్ జలాల్లో చిక్కుకుపోయాయి. ప్రస్తుతం భారత జెండా కలిగిన చమురు ట్యాంకర్లు, LPG క్యారియర్లలో సుమారు 400 మంది భారతీయ నావికులు ఉన్నారని INSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ దేవ్లీ తెలిపారు.
హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటి. దాదాపు 20 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ ఎగుమతులు ఈ మార్గం ద్వారా వెళ్తాయి. భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, LNG దిగుమతుల్లో 50శాతం పైగా ఈ మార్గం ద్వారా రవాణా చేస్తుండటం పరిస్థితిని మరింత ప్రమాదకరం చేస్తుంది.ఈ వివాదం షిప్పింగ్ ఖర్చులను కూడా పెంచింది. యుద్ధ-ప్రమాద బీమా ప్రీమియంలు రెట్టింపు స్థాయికి చేరకపోవచ్చని దేవ్లీ హెచ్చరించారు. సరుకు రవాణా ధరలు ఇప్పటికే పెరిగినందున, కొత్త ఆర్డర్‌లు తీసుకోవడంలో ఆపరేటర్లు జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పారు.
NDTV ప్రాఫిట్ ప్రకారం.. భారతదేశం నుండి మధ్య ఆసియా దేశాలకు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఓడరేవులలో లేదా ఓడల్లో చిక్కుకుపోయాయి. వీటి ప్రభావంగా ప్రపంచ చమురు ధరలు కూడా అస్థిరత చెందాయి. గల్ఫ్ నుండి ఎగుమతులపై భయాల కారణంగా బ్రెంట్ ముడి చమురు ధర 120 డాలర్లకి చేరింది, తరువాత 92 నుంచి 95డాలర్ల వరకు తగ్గింది. US ముడి చమురు ధర ప్రస్తుతం 90 డాలర్ల వద్ద ఉంది. వ్యాపారులు, మార్కెట్ విశ్లేషకులు హార్ముజ్ చుట్టూ కొనసాగుతున్న పరిణామాలను, మధ్యప్రాచ్య సంఘర్షణను నిశితంగా గమనిస్తున్నారని, దీనివల్ల చమురు మార్కెట్లు తీవ్ర అస్థిరతలో ఉన్నాయి అని చెబుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..నేనే లేకుంటే టెహ్రాన్ చేతిలో ప్రపంచం ముక్కలయ్యేదని వెల్లడి..

హార్ముజ్ జలసంధి నిండా మందు పాతరలే.. ఏ క్షణమైనా పేలే అవకాశం.. ఇరాన్ స్కెచ్‌కి ట్రంప్ ఫ్యూజులు ఔట్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..హార్ముజ్ జలసంధి వేదికగా పశ్చిమాసియాలో సరికొత్త వార్..

మళ్లీ టారిఫ్ బాదుడు మొదలు పెట్టిన ట్రంప్.. ఇరాన్‌తో పాటు చైనా అంతు కూడా చూస్తామని సంచలన ప్రకటన..

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు..డబుల్ గేమ్ మొదలు పెట్టిన చైనా.. గగ్గోలుపెడుతున్న ట్రంప్ ..

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications