For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త, తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర

|

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణిస్తుండటంతో తదనుగుణంగా దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు తాజాగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ మూడు రోజులు క్షీణించాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఊరట వినిపించాయి చమురు రంగ కంపెనీలు. ఏప్రిల్ 1వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్‌పై రూ.10 తగ్గింది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం తెలిపింది.

నేటి నుండి (గురువారం, ఏప్రిల్ 1)రూ.10 తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 819గా ఉండగా, కోల్‌కతాలో రూ. 845, ముంబైలో రూ. 819, చెన్నైలో రూ. 835గా ఉన్నాయి. 2021 ఏడాదిలో గ్యాస్ ధరలు మూడుసార్లు పెరిగాయి. గ్యాస్ సిలిండర్ పైన దాదాపు రూ.125 పెరిగాయి. గత మూడు నెలల్లో రూ.200 పెరిగాయి.

LPG cylinder prices to become cheaper from April

కరోనా కారణంగా 2020లో చమురు, సహజవాయు ఉత్పత్తి తగ్గింది. గత ఏడాది నవంబర్ నుండి క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలను చమురు రంగ సంస్థలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తాయి. గ్యాస్ ధరలను ప్రతి నెల 1న సవరిస్తాయి. అయితే ఇటీవల ఒకే నెలలో రెండుమూడుసార్లు సవరించాయి.

English summary

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త, తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర | LPG cylinder prices to become cheaper from April

Offering some relief to the common man, the prices of non-subsidised Liquefied petroleum gas (LPG) cylinder will go down from April. Starting from 1 April, the cost of domestic cooking gas will be reduced by Rs 10, Indian Oil Corporation Limited said on Wednesday.
Story first published: Thursday, April 1, 2021, 9:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X