For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్‌లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావం

|

న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజుల్లో నాలుగుసార్లు పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు, కేవలం నాలుగు రోజుల్లోనే రెండుసారి వినియోగదారులకు షాకిచ్చాయి. వంట గ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్ పైన కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి చమురురంగ సంస్థలు. పెరిగిన ధరలు మార్చి 1 (నేటి నుండి) అమల్లోకి వచ్చాయి. వంట గ్యాస్ పైన రూ.25, కమర్షియల్ సిలిండర్ పైన రూ.95 పెంచాయి. ఫిబ్రవరి 25వ తేదీన రూ.25 పెంచిన చమురురంగ సంస్థలు, తాజాగా మరో రూ.25 పెంచాయి. దీంతో నాలుగు రోజుల్లో రూ.50 పెరిగింది.

గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశంగుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం

2న నెలల్లో రూ.225 జంప్ ఇలా

2న నెలల్లో రూ.225 జంప్ ఇలా

గత ఏడాది డిసెంబర్ నుండి ధరలు రూ.225 పెరిగాయి. డిసెంబర్ 1న సిలిండర్ ధర రూ.50 పెరిగి రూ.594 నుండి రూ.644కు చేరుకుంది. ఆ తర్వాత జనవరి 1వ తేదీన మరో రూ.50 పెరిగి రూ.644 నుండి రూ.694కు చేరుకుంది. సాధారణంగా చమురురంగ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 1, జనవరి 1న పెరిగాయి. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 1న ధరల్లో మార్పులేదు. కానీ ఫిబ్రవరి 4వ తేదీన రూ.25 పెరిగి రూ.719కి చేరుకుంది. ఫిబ్రవరి 15న మరో రూ.15 పెరిగి రూ.769కి, ఫిబ్రవరి 25న రూ.25 పెరిగి రూ.794, తాజాగా మరో రూ.25 పెరిగి రూ.819కి చేరుకుంది. మొత్తం రెండు నెలల్లో రూ.225 పెరిగింది.

హైదరాబాద్‌లో ధర ఎంతంటే

హైదరాబాద్‌లో ధర ఎంతంటే

కమర్షియల్ సిలిండర్ పైన తాజాగా రూ.95 పెరగడంతో ఒక సిలిండర్ ధర రూ.1614కు చేరుకుంది. ధరలు పెరిగిన అనంతరం వంట గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.846.50 నుండి రూ.871.50కి చేరుకుంది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819 కోల్‌కతాలో రూ.845కు చేరుకుంది. మెట్రో నగరాల్లో హైదరాబాద్, కోల్‌కతాల్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి.

గ్యాస్ ధరలపై ఈ ప్రభావం

గ్యాస్ ధరలపై ఈ ప్రభావం

ఏడాదికి 12 ఎల్పీజీ సిలిండర్లు సబ్సిడీ మీద అందుతాయి. 12 సిలిండర్లు దాటితే ఆ తర్వాత మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయవలసి ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ.100 పైకి చేరుకుంది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో రూ.90 క్రాస్ చేసింది. ఇదే సమయంలో ఎల్బీజీ కూడా పెరుగుతోంది. క్రూడాయిల్, ఫారెన్ ఎక్స్చేంజ్ ధరలు గ్యాస్ సిలిండర్ ధరలపై ప్రభావం చూపుతాయి.

English summary

పెరిగిన సిలిండర్ ధరలు: హైదరాబాద్‌లో ఎంత అంటే? LPGపై వీటి ప్రభావం | LPG Cylinder Price Up rs 25, Here's How Much You Pay For A Cylinder Now

Non-subsidised liquefied petroleum gas (LPG) prices were hiked by ₹ 25 on March 1, 2021. With effect from March 1, the price of non-subsidised LPG is at ₹ 819 per cylinder (14.2 kilograms) in Delhi, according to Indian Oil Corporation. Indian Oil, the country's largest fuel retailer, supplies LPG under the brand Indane.
Story first published: Monday, March 1, 2021, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X