Multibagger: లక్ష పెట్టుబడిని ఏడాదిలో ముడింతలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. గరిష్ఠంగా రూ. 5 లక్షలకు పైగా..
Multibagger Stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ ప్రతి ఇన్వెస్టర్ కు చాలా ఇష్టమైనవి. వీటి కోసం చాలా మంది రీసెర్చ్ చేస్తుంటారు కూడా. ఇవి అనతి కాలంలోనే పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇస్తుంటాయి. ఈ కోవకు చెందినదే.. లాయిడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ(Lloyds Metals & Energy) కంపెనీ గ్రూప్ T క్యాటగిరీ స్టాక్. ఈ కంపెనీ స్పాంజ్ ఐరన్, పవర్ జనరేషన్, మైనింగ్ కార్యకలాపాల తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ 1,800 TPA, 10,000 TPA కెపాసిటీతో స్టెయిన్ లెస్ స్టీల్ పట్టాను తయారు చేయడానికి అవసరమైన తయారీ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ స్టాక్ కేవలం ఒక్క ఏడాదిలోనే తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఈ క్రమంలో షేర్ విలువ రూ.45 నుంచి రూ.133లకు పెరిగి ఏకంగా 196 శాతం రాబడిని అందించింది.
LMEL 2,70,000 TPA సామర్థ్యం గల స్పాంజ్ ఐరన్ ప్లాంట్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. ఇది ఒరిస్సా స్పాంజ్ ఐరన్ నుంచి సాంకేతికతను తీసుకుంది. చంద్రపూర్ సమీపంలోని ఘుగుస్‌లో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పరికరాల కొలిమి, కూలర్, ఇతర ప్రధాన నిర్మాణాల ప్రధాన రకాలు లాయిడ్స్ స్టీల్ ఇంజినీరింగ్ డివిజన్, ముర్బాద్ ద్వారా రూపొందించబడ్డాయి. సరఫరా చేయబడ్డాయి. లాయిడ్స్ స్టీల్ ఇంజినీరింగ్ డివిజన్ బట్టీలు, భారీ పరికరాలు, నిర్మాణాలను రూపొందించడానికి పూర్తి మౌలిక సదుపాయాలను కలిగి ఉంది.

ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ బలమైన ఫలితాలను నివేదించింది. మార్చి 2022లో నికర అమ్మకాలు రూ. 333.21 కోట్లుగా ఉన్నాయి. ఇది మార్చి 2021లో 95.24 కోట్లు నుంచి 249.85% పెరిగింది. నికర లాభం మార్చి 2022లో రూ. 123.39 కోట్లకు చేరుకోగా.. గత మార్చి 2021లో రూ. 5.35 కోట్లుగా ఉంది. అంటే 2206.7% పెరుగుదల. EBITDA మార్చి 2022లో రూ. 122.54 కోట్లకు చేరుకుంది. ఇది మార్చి 2021లో 14.66 కోట్ల నుంచి 35.88% పెరిగింది. బీఎస్‌ఈలో షేరు 52 వారాల గరిష్టం రూ.232 ఉండగా.. 52 వారాల కనిష్టం రూ.39.85గా ఉంది.