Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు 13 రోజుల సెలవు.. ఈ రోజుల్లో మూసివేత.. రిజర్వు బ్యాంక్ వెల్లడి..
Bank Holidays In August 2022: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు నెలలో జాతీయ లేదా ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సెలవుల కారణంగా బ్యాంకులు మూసివేయబడే రోజుల జాబితాను విడుదల చేసింది. మొత్తంగా.. ఆగస్టులో బ్యాంకులు 13 రోజులు (రెండవ/నాల్గవ శనివారాలు, ఆదివారాలు కాకుండా) దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మూసి ఉంటాయి. ఈ కారణంగా ప్రజలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఖచ్చితంగా బ్యాంక్ కార్యాలయానికి వెళ్లి పూర్తి చేయవలసిన పనులను వెంటనే కంప్లీట్ చేసుకోవటం మంచిది.
అయితే.. బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉంటాయి. ఈ సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతుంటాయి. ప్రాంతీయ పండుగలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిలో స్వల్ప మార్పులు ఉంటాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.

బ్యాంకుల సెలవుల జాబితా..
ఆగస్టు 1: ద్రుక్పా త్షే-జి (సిక్కిం), ఆదివారం
ఆగస్టు 8: ఆదివారం
ఆగస్టు 9: మోహర్రం పండుగ
ఆగస్టు 11, 12: రక్షా బంధన్(Raksha Bandhan)
ఆగస్టు 13: దేశభక్తుల దినోత్సవం (Imphal)
ఆగస్టు 14: రెండవ శనివారం
ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16: పార్శీల నూతన సంవత్సరం (Belapur, Mumbai and Nagpur)
ఆగస్టు 18: జన్మాష్టమి
ఆగస్ట్ 19: శ్రావణ వద్/కృష్ణ జయంతి
ఆగస్టు 20: శ్రీకృష్ణాష్టమి
ఆగస్టు 22: ఆదివారం
ఆగస్ట్ 28: నాల్గవ శనివారం
ఆగస్టు 29: శ్రీమంత శంకరదేవుని తిథి, ఆదివారం
ఆగస్టు 31: గణేష్ చతుర్థి/ వరసిద్ధి వినాయక వ్రతం/ వినాయక చతుర్థి


Click it and Unblock the Notifications