For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC: రెండు రోజుల్లో రూ.16,580 కోట్లు నష్టపోయిన ఎల్ఐసీ.. ఆందోళనలో పెట్టుబడిదారులు..!

|


భారత స్టాక్ మార్కెట్ ను హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక షేక్ చేసింది. ముఖ్యంగా అదానీ గ్రూప్ స్టాక్‌లు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో పాటు అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ఆర్థిక సంస్థలు, లోన్లు ఇచ్చిన బ్యాంకులు కూడా భారీగా నష్టపోయాయి. అందులో ఎల్ఐసీ మొదటి స్థానంలో ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అదానీ గ్రూప్ స్టాక్‌లలో భారీ వాటాను కలిగి ఉంది. ఎల్ఐసీ గత రెండు రోజుల్లో రూ.16,580 కోట్లు నష్టపోయింది. గత రెండు రోజుల్లో జరిగిన ఈ రూ.16,580 కోట్ల నష్టంలో అదానీ టోటల్ గ్యాస్‌లో రూ.6,232 కోట్లను కోల్పోయింది. ఈ కంపెనీలో ఎల్ఐసీకి 5.96 శాతం వాటా ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ ఎంటర్‌ప్రైజెస్

అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో ఎల్ఐసీ 4,81,74,654 షేర్లను కలిగి ఉంది. ఈ కంపెనీలో ఎల్ఐసీ దాదాపు 4.23 శాతం వాటాను కలిగి ఉంది. గత రెండు రోజుల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర రూ.3,442 నుంచి రూ.2,768.50కి పడిపోయింది. అంటే అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గత రెండు రోజుల్లో ఒక్కొక్కటి రూ.673.5 నష్టపోయాయి. గత రెండు రోజుల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు పతనంలో ఎల్‌ఐసి సుమారు రూ.3,245 కోట్లు (రూ.673.50 x 4,81,74,654) కోల్పోయింది.

అదానీ పోర్ట్స్

అదానీ పోర్ట్స్

అదానీ పోర్ట్స్ లో ఎల్ఐసీకి 19,75,26,194 షేర్లు ఉన్నాయి. అంటే 9.14 శాతం వాటాను కలిగి ఉంది. గత రెండు రోజుల్లో అదానీ పోర్ట్ షేర్ ధర ఒక్కో స్థాయికి రూ.761.20 నుంచి రూ.604.50కి పడిపోయింది. రెండు సెషన్లలో ఒక్కో షేరుకు రూ.156.70 నష్టపోయింది. ఈ రెండు రోజుల్లో LIC రూ.3,095 కోట్లు (₹156.70 x 19,75,26,194)నష్టపోయింది.

అదానీ ట్రాన్స్‌మిషన్

అదానీ ట్రాన్స్‌మిషన్

LICకి అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీలో 4,06,76,207 షేర్లు ఉన్నాయి. అంటే 3.65 శాతం వాటాను కలిగి ఉంది. గత రెండు రోజుల్లో, అదానీ ట్రాన్స్‌మిషన్ షేరు ధర ఒక్కొక్కటి రూ.2,762.15 నుంచి రూ.2,014.20కి పడిపోయింది. ఈ రెండు రోజుల్లో ఒక్కో షేరుకు రూ.747.95 నష్టపోయింది. గత రెండు రోజుల అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లలో LIC నష్టం రూ.3,042 కోట్లు (₹747.95 x 4,06,76,207) నష్టపోయంది.

అదానీ గ్రీన్

అదానీ గ్రీన్

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఎల్ఐసీకి 2,03,09,080 షేర్లు ఉన్నాయి. అంటే 1.28 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ గ్రీన్ షేర్ ధర గత రెండు రోజుల్లో ఒక్కొక్కటి రూ.430.55 తగ్గింది. ఇది గత రెండు వరుస సెషన్లలో ఎల్ఐసీకి దాదాపు రూ.875 కోట్ల నష్టానికి కలిగించింది.

English summary

LIC: రెండు రోజుల్లో రూ.16,580 కోట్లు నష్టపోయిన ఎల్ఐసీ.. ఆందోళనలో పెట్టుబడిదారులు..! | Life Insurance Corporation of India has lost Rs.16,580 crore in two days

Hindenburg Research report shook the Indian stock market. Adani Group stocks in particular lost heavily. In addition to this, financial institutions that invested in Adani companies and banks that gave loans also suffered huge losses.
Story first published: Saturday, January 28, 2023, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X