For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ పరిమితిని పెంచండి... బీమా కంపెనీలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయంటే?

|

దేశీయంగా జీవిత బీమా వ్యాపారం జోరందుకుంటోంది. వినూత్న మార్గాల ద్వారా కంపెనీలు మరింత ఎక్కువ మంది కస్టమర్లను చేరుకుంటున్నాయి. అయితే భారీ స్థాయిలో విస్తరించడానికి నిధుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచమంటున్నారు. ఒకవేళ ఈ మేరకు పరిమితిని పెంచితే 40,000-60,000 కోట్ల రూపాయల మూలధనాన్ని ఆకర్షించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

జోరుగా పెరిగిన వ్యాపారం

* 2015 సంవత్సరంలో ప్రభుత్వం బీమా రంగంలో ఎఫ్ డీ ఐ ని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచింది. అప్పటి నుంచి ప్రైవేట్ బీమా కంపెనీలు దాదాపు 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పొందగలిగాయి.
* ఆటోమేటిక్ మార్గంలో వచ్చే పెట్టుబడుల పరిమితిని పెంచడం ద్వారా ఈ పెట్టుబడులు రెండింతలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆటోమేటిక్ మార్గానికి అనుమతి ఇస్తే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సిన అవసరం ఉండదు.
* ఎఫ్ డీ ఐ వాటాను పెంచడం వల్ల 2014 సంవత్సరంలో 3 లక్షల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్న భారత జీవిత బీమా రంగం ప్రీమియం ఆదాయం 2018 సంవత్సరం నాటికీ 4.5 లక్షల కోట్లకు చేరుకుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
* 2014-15, 2015-16సంవత్సరాల్లో ప్రైవేట్ రంగ కంపెనీల మొత్తం ప్రీమియం ఆదాయం 14 శాతం చొప్పున పెరిగితే, 2017, 2018 సంవత్సరాల్లో వరుసగా 17 శాతం, 19 శాతం మేర పెరిగింది.
* ఎఫ్ఢీఐ పరిమితి పెంచడం వల్ల ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల నిర్వహణలో ఆస్తులు 2014 సంవత్సరంలో 1.07 లక్షల కోట్ల స్థాయిలో ఉంటె.. 2018 సంవత్సరంలో 2.54 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

Life insurance companies seeking to increase FDI limit to 100 percent

ఇవీ ప్రయోజనాలు

ఈ స్థాయిలో మూలధనం వస్తే తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. వ్యాపార విస్తరణ ద్వారా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరింత ఎక్కువ మందికి బీమా రక్షణను అందుబాటులోకి తీసుకురావచ్చు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ రంగ వృద్ధి వల్ల నిరుద్యోగిత తగ్గే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ రంగం దేశ ఆర్ధిక వ్యవస్థ వృద్ధిలో, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది.
* ప్రస్తుతం బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. బీమా వ్యాపారం విస్తరించడం వల్లజీఎస్టీ వసూళ్లు, ఇతర పన్నులు పెరగడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* విదేశీ పెట్టుబడి పరిమితిని పెంచడం వల్ల ప్రైవేట్ బీమా కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చంటున్నారు. అంతేకాకుండా టెక్నికల్ నైపుణ్యాలను కూడా తీసుకురావచ్చంటున్నారు.
* విదేశీ పెట్టుబడుల ద్వారా వేగవంతంగా, ఎక్కువగా క్లైములను సెటిల్ చేయవచ్చంటున్నారు. బీమా వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. బీమా వ్యాప్తి వల్ల మరింత ఎక్కువ మందికి బీమా రక్షణను కలిపించే ఆస్కారం ఉంటుంది.

English summary

ఆ పరిమితిని పెంచండి... బీమా కంపెనీలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయంటే? | Life insurance companies seeking to increase FDI limit to 100 percent

Life insurance companies asking to increase foreign direct investment limit in the sector to 100 percent through automatic route. If the decision is taken the sector can attract more investments. If the sector is grown additional employment opportunities will come. The sector is playing key role in the economy also.
Story first published: Monday, December 23, 2019, 7:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X