For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC IPO: పాపం LIC ఇన్వెస్టర్లు.. పడిపోతున్న షేర్ ధర.. ఏడాది ఆగినా రేటు పెరగదా..

|

LIC IPO: 2022లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈవెంట్లలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఐపీవో అని చెప్పుకోవాలి. అయితే.. దీనిలో పెట్టుబడి పెట్టిన స్టాక్‌హోల్డర్లకు తర్వాత జరిగినదంతా పీడకల కంటే తక్కువేమీ కాదని చెప్పుకోవాలి. మార్కెట్లో లిస్టింగ్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు LIC IPO నష్టాలు రూ. 1,800 కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. దాని వాల్యుయేషన్‌లో దాదాపు మూడవ వంతు వరకు కోల్పోయింది.శుక్రవారం నాడు ఎల్‌ఐసీ షేరు 3.2 శాతం తగ్గి రూ.661.70 వద్ద ముగిసింది. ఇష్యూ ధర రూ. 949 నుంచి షేరు 30% కంటే ఎక్కువ క్షీణించింది. దీంతో ఇన్నెస్టర్లకు భారీ నష్టం తప్పలేదు.

అంతే కాకుండా గ్లోబల్ బ్రోకరేజీల ధరల ప్రకారం.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్సూరెన్స్ దిగ్గజ సంస్థ షేర్లు ఇప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత కూడా IPO ధరను దాటే అవకాశం లేదని తెలుస్తోంది. ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎల్ఐసీ షేర్ కు ఇచ్చిన బెస్ట్ టార్గెట్ రూ.930. ఇష్యూ ధర అయిన రూ.949 కంటే కేవలం 2 శాతం మాత్రమే తక్కువగా ఉంది.

lic share tanking investors money since its listing know details

మరోవైపు.. గోల్డ్‌మన్ సాచ్స్ టార్గెట్ ధర రూ.700 ఇష్యూ ధర కంటే 35% తక్కువగా ఉంది. అయితే JP మోర్గాన్ టార్గెట్ ధర రూ. 840 ఇష్యూ ధర కంటే 13% తక్కువగా ఉన్నాయి. 2023లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఈ టార్గెట్లను అందుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక ప్రకారం.. ఎల్‌ఐసీ వృద్ధికి అవకాశం ఉంది. ప్రైవేట్ ప్లేయర్లతో పోలిస్తే ఎల్‌ఐసీ స్టాక్ 47-70% తగ్గింపుతో లభిస్తోందని బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

Read more about: lic ఎల్ఐసీ
English summary

LIC IPO: పాపం LIC ఇన్వెస్టర్లు.. పడిపోతున్న షేర్ ధర.. ఏడాది ఆగినా రేటు పెరగదా.. | lic share lost 18 billion dollars in valu till now from its day of listing in stock exchanges

lic share tanking investors money since its listing know details
Story first published: Sunday, June 26, 2022, 19:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X