For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు

|

పాలసీల పునరుద్ధరణకు గడువును లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరోసారి పొడిగించింది. రద్దయిన పాలసీ పునరుద్ధరణకు ఎల్ఐసీ ఇటీవల ప్రత్యేక పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని రిబేట్లు, ప్రత్యేక సదుపాయాలు కూడా పాలసీహోల్డర్లకు కల్పించింది.

ఎల్ఐసీ పాలసీలు.. మరిన్ని వార్తలు

31 డిసెంబర్ 2013 తర్వాత పాలసీ కొనుగోలు చేసిన వారికి ఈ పథకాన్ని వర్తింపచేస్తుంది. దీనికి మంచి స్పందన వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో పాలసీ పునరుద్ధరణ గడువును 30 నవంబర్ 2019 వరకు పొడిగించినట్లు తెలిపింది. దీనిని పాలసీదారులు ఉపయోగించుకుంటే మంచిది.

LIC Revival Campaign: LIC allows revival of lapsed policy till November 30

2013 డిసెంబర్ 31 తర్వాత పాలసీ కొనుగోలు చేసి ఒకవేళ రద్దయితే దానిని ఇప్పుడు పునరుద్ధరించుకోవచ్చని తెలిపింది. ఇంతకుముందు ఈ సదుపాయం పాలసీ ప్రీమియం చెల్లించనప్పటి నుంచి రెండేళ్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ కాలపరిమితి నాన్ లింక్డ్ పాలసీలకు అయిదేళ్లు, లింక్డ్ పాలసీలకు మూడేళ్ల వరకు ఉంది.

English summary

ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు | LIC Revival Campaign: LIC allows revival of lapsed policy till November 30

Life Insruance Corporation of India revival campaign extended to November 30, 2019.
Story first published: Monday, November 18, 2019, 9:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X