For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై ఛార్జీలు ఉండవ్, వీటిపై కూడా..

|

క్రెడిట్ కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు జరిపేవారికి శుభవార్త. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రీమియం చెల్లింపులపై విధించనున్న ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు సోమవారం నాడు ప్రకటించింది.

తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..

ఎప్పటి నుంచి?

ఎప్పటి నుంచి?

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహించేందుకు గాను క్రెడిట్ కార్డు ద్వారా ద్వారా జరిపే ప్రీమియం చెల్లింపులపై విధిస్తున్న ఛార్జీలను డిసెంబర్ 1వ తేదీ నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సోమవారం ఎల్ఐసీ ప్రకటించింది. ఇది అమలులోకి వచ్చిందని పేర్కొంది.

ఎలాంటి రుసుము ఉండదు

ఎలాంటి రుసుము ఉండదు

ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డు ద్వారా రెన్యువల్ ప్రీమియం, కొత్త ప్రీమియం, ముందస్తు ప్రీమియం, రుణాల చెల్లింపులు, పాలసీలపై తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లింపులపై అదనపు ఛార్జీల వసూలు ఉండదు. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్స్‌ను ఉచితంగా నిర్వహించుకోవచ్చు.

అక్కడ కూడా...

అక్కడ కూడా...

ఇక నుంచి కార్డురహిత చెల్లింపులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ల వద్ద కార్డు డిప్/స్వైప్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి అదనపు భారం ఉండదని కూడా ఎల్ఐసీ తన ప్రకటనలో తెలిపింది. Mylic Appలో అన్ని రకాల ఆన్ లైన్ సేవలకు వీలు కల్పించినట్లు తెలిపింది. దీనిని డౌన్ లోడ్ చేసుకొని ప్రీమియం చెల్లింపులు జరుపుకోవచ్చునని సూచించింది.

English summary

LIC గుడ్‌న్యూస్: క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై ఛార్జీలు ఉండవ్, వీటిపై కూడా.. | LIC of India waives off charges on credit card payments

To promote digital transactions, Life Insurance Corporation has waived off the convenience fee on all payments to the national insurer, effective December 1.
Story first published: Tuesday, December 3, 2019, 10:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X