For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC IPO: పాలసీహోల్డర్స్, ఉద్యోగుల విభాగంలో ధరఖాస్తులు అదుర్స్!

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మెగా పబ్లిక్ ఇష్యూకు మంచి స్పందన లభించింది. మొదటి రోజునే పాలసీదారుల విభాగంలో దాదాపు రెండు రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఉద్యోగుల విభాగంలోను మంచి స్పందన లభించింది. ఎల్ఐసీ ఐపీవో 9వ తేదీన ముగియనుంది. ఎల్ఐసీ పాలసీదారులు, ఉద్యోగుల విభాగానికి సంబంధించి సాధ్యమైనంత ఎక్కువ దరఖాస్తు చేసుకోవాలని విశ్లేషకులు సూచించారు. రిజర్వ్డ్ కేటగిరీ సభ్యులు... రిటైల్ కేటగిరీ కంటే ముందు తమ పాలసీదారులు, ఉద్యోగుల కేటగిరీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎందుకంటే రిటైల్ కేటగిరీలో షేర్ల కేటాయింపు లాట్ల ద్వారా, రిజర్వ్డ్ కేటగిరీలో దామాషా పద్ధతిలో జరుగుతుంది. రిటైల్ కేటగిరీ దరఖాస్తులతో పోలిస్తే రిజర్వ్డ్ కేటగిరీలో కేటాయింపుల ద్వారా షేర్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా మార్కెట్లకు శనివారం సెలవు రోజు. అయితే ఐపీవోకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. అలాగే ఎల్ఐసీ ఐపీవో దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ బ్యాంకుల శాఖలు ఆదివారం తెరిచే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.

LIC IPO: policyholders, employees apply for maximum lots, Why?

ఎల్ఐసీ ఐపీవోకు నెట్ బ్యాంకింగ్ ద్వారా, డీమ్యాట్ ఖాతా ద్వారా, జెరోధా ద్వారా, పేటీఎం మనీ యాప్ ద్వారా, అప్ స్టాక్స్ ద్వారా.. ఇలా వివిధ రకాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీలో 3.50 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించి రూ.21000 కోట్లు సమీకరించనుంది ప్రభుత్వం. ధరల శ్రేణి రూ.902 నుండి రూ.949. పాలసీదారులకు రూ.60, రిటైలర్లు, ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్ ఉంది. ఎల్ఐసీ ఐపీవోలో 1 లాట్ సైజ్ 15 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 14 లాట్లు కొనుగోలు చేయవచ్చు.

English summary

LIC IPO: పాలసీహోల్డర్స్, ఉద్యోగుల విభాగంలో ధరఖాస్తులు అదుర్స్! | LIC IPO: policyholders, employees apply for maximum lots, Why?

Share allotment in retail category will be done through draw of lots whereas in policyholders and employees category, share allotment will be done through proportionate basis.
Story first published: Thursday, May 5, 2022, 18:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X