For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC: పాలసీదారులకు ఎల్ఐసీ సదవకాశం.. ల్యాప్స్ పాలసీ పునరుద్ధరణకు ఛాన్స్.. పెనాల్టీపై డిస్కౌంట్స్..

|

LIC Lapsed Policy Revival: ప్రభుత్వ హయాంలోని బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తమ పాలసీదారులకు మంచి అవకాశాన్ని కల్పించింది. అనేక కారణాల వల్ల పాలసీలకు చెల్లింపులు నిలిపివేసి ల్యాప్స్ అయిన వారికి మరో సదవకాశాన్ని అందిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల 17 నుంచి అవకాశం..

ఈనెల 17 నుంచి అవకాశం..

ల్యాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించాలనుకునే పాలసీదారులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. దీని ప్రకారం.. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 21, 2022న వరకు పాలసీలను తిరిగి పునరుద్ధరించుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రత్యేక అవకాశం అన్ని యులిప్-యేతర పాలసీల కోసం అందుబాటులో ఉంది. ఆలస్య రుసుముల్లో చాలా ఆకర్షణీయమైన రాయితీని కూడా బీమా దిగ్గజం అందిస్తోంది.

మరో అవకాశం ఇచ్చేందుకు..

మరో అవకాశం ఇచ్చేందుకు..

అనివార్య పరిస్థితుల కారణంగా ప్రీమియంలు చెల్లించలేని పాలసీ ల్యాప్స్ అయిన వారికి మరో అవకాశం కల్పించడమే లక్ష్యమని ఎల్ఐసీ వెల్లడించింది. ఈ అవకాశం కింద ULIP పాలసీలు మినహా, పాలసీ షరతులకు లోబడి చెల్లింపు నిలిపివేసిన ప్రీమియం తేదీ నుంచి 5 సంవత్సరాలలోపు అన్ని పాలసీలను పునరుద్ధరించవచ్చని ఎల్ఐసీ తెలిపింది.

పెనాల్టీ వివరాలు ఇలా..

పెనాల్టీ వివరాలు ఇలా..

ప్రీమియం ఆధారంగా గరిష్ఠంగా 25 శాతం నుంచి 30 శాతం వరకు లేదా రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఆలస్య రుసుము ఉంటుందని ఎల్ఐసీ వెల్లడించింది. మైక్రో-ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో.. ఆలస్య రుసుములలో 100 శాతం మినహాయింపు అందుబాటులో ఉంది. రిస్క్ కవర్ సరసమైన పునరుద్ధరణను సులభతరం చేయడానికి మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు 100 శాతం ఆలస్య రుసుము మినహాయింపు అందిస్తున్నట్లు బీమా దిగ్గజం తెలిపింది.

పెనాల్టీలపై డిస్కౌంట్స్..

పెనాల్టీలపై డిస్కౌంట్స్..

రూ. లక్ష వరకు మొత్తం స్వీకరించదగిన ప్రీమియం కలిగిన పాలసీలకు.. రూ.2,500 వరకు 25 శాతం ఆలస్య రుసుము రాయితీ అనుమతించబడుతుంది. రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు స్వీకరించదగిన ప్రీమియం ఉన్న పాలసీలకు 25 శాతం, రూ.3,000 వరకు ఆలస్య రుసుము రాయితీ అందించబడుతోంది. అయితే.. రూ.3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ స్వీకరించదగిన ప్రీమియమ్‌కు 30 శాతం ఆలస్య రుసుము రాయితీ ఉంటుంది. ఇది అత్యధికంగా 3,000 వరకు అనుమతించబడుతుంది. అయితే.. వైద్య అవసరాలలో ఎటువంటి రాయితీలు లేవు.

అరుదైన అవకాశం..

అరుదైన అవకాశం..

LIC తన విలువైన పాలసీదారులకు ల్యాప్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవటానికి అరుదైన అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను రక్షించుకోవటానికి, ఇన్సూరెన్స్ ప్రయోజనాలను తిరిగి పొందటానికి ఇదొక అరుదైన అవకాశమని కంపెనీ వెల్లడించింది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా తమ దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తోంది.

English summary

LIC: పాలసీదారులకు ఎల్ఐసీ సదవకాశం.. ల్యాప్స్ పాలసీ పునరుద్ధరణకు ఛాన్స్.. పెనాల్టీపై డిస్కౌంట్స్.. | lic allows policy holders to revive lapsed policied with discounts on fines know full details

LIC unveils a unique opportunity for policyholders to revive lapsed policies..
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X