న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ అమలు చేస్తోన్న పలు పాలసీలు జనంలోకి చొచ్చుకెళ్లాయి. వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. హెల్త్, సేవింగ్స్ మీద అవగాహన ఏర్పడిన తరువాత.. దీర్ఘకాలిక ప్రయోజనాలను కల్పించడానికి ఉద్దేశించిన ఎల్‌ఐసీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు పలు రకాల బీమా పథకాలను అమలు చేస్తోంది.

ఆధార్ శిలా పాలసీ..
ఇందులో ఒకటి- ఆధార్ శిలా పాలసీ. ప్రత్యేకించి మహిళల కోసమే అమల్లోకి తీసుకొచ్చింది. ఎనిమిదేళ్ల నుంచి 55 సంవత్సరాల వరకు వయస్సున్న వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. జీవిత బీమా, పొదుపుగా ఉపయోగపడుతుంది. మెచ్యూరిటీ అయిన తరువాత పాలసీదారునికి ఒకేసారి ఈ మొత్తం అందుతుంది.

రూ.3 లక్షల వరకు..
ఒకవేళ దురదృష్టవశావత్తూ మెచ్యూర్డ్ కావడానికి ముందే పాలసీదారు మరణిస్తే- ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఆధార్ శిలా పాలసీలో కనిష్ఠంగా జమ చేయాల్సిన మొత్తం 75,000 రూపాయలు. గరిష్ఠంగా 3,00,000 రూపాయలను పాలసీగా కట్టొచ్చు. 10 నుంచి 20 సంవత్సరాల వ్యవధి ఉంటుంది.

10 నుంచి 20 సంవత్సరాల వరకు..
అంటే ప్రీమియం చెల్లించడం మొదలు పెట్టిన నెల నుంచి కనిష్ఠంగా 10 సంవత్సరాలు.. గరిష్ఠంగా 20 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ అయిన తరువాత కనిష్ఠంగా 75,000 రూపాయలు, గరిష్ఠంగా 30 లక్షల రూపాయల మొత్తాన్ని పాలసీదారు తీసుకోవచ్చు.

సంవత్సరాల వారీగా..
20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ ప్లాన్‌లో చేరితే.. సంవత్సరానికి కట్టాల్సిన ప్రీమియం 10,950 రూపాయలు. ప్రతిరోజూ 30 రూపాయలను కేటాయించగలిగితే ప్రీమియం మొత్తాన్ని కట్టొచ్చు. అలాగే 30 సంవత్సరాల వయస్సులో ఈ పాలసీలో చేరితే 20 సంవత్సరాలకు కట్టాల్సిన మొత్తం 2,19,000 రూపాయలు అవుతుంది.

మెచ్యూరిటీ తరువాత..
మెచ్యూరిటీ అనంతరం 3,97,000 రూపాయలు చేతికి అందుతాయి. ప్రీమియం మొత్తాన్ని ప్రతి నెలా కట్టొచ్చు. లేదా మూడు నెలలకోసారి, ఆరు నెలలకోసారి చెల్లించే వెసలుబాటు ఉంది. లేదా సంవత్సరం మొత్తానికీ కలిపి ఒకేసారయినా ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు.

మహిళల నుంచి ఆదరణ..
మహిళల కోసం ఉద్దేశించినందు వల్ల కొన్ని రాయితీలను కల్పించింది ఎల్ఐసీ. మెచ్యూరిటీ క్లెయిమ్, డెత్ క్లెయిమ్‌పై పన్ను మినహాయింపు సౌకర్యాన్ని కల్పించింది. ఈ పాలసీకి మంచి ఆదరణ లభిస్తోంది. మహిళల కోసం ఉద్దేశించిన పాలసీ వల్ల మధ్య తరగతి కుటుంబీకుల నుంచి ఆదరణ ఉందని ఎల్ఐసీ అధికారులు చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications