For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Edible Oil: వినియోగదారులకు శుభవార్త.. భారీగా వంటనూనె ధరలు తగ్గించిన దిగ్గజ కంపెనీలు..

|

Edible Oil: ఈ నెల ప్రారంభంలో దిగుమతి చేసుకున్న వంట నూనెల గరిష్ట రిటైల్ ధరని వారంలోగా లీటరుకు రూ. 10 వరకు తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే మథర్ డెయిరీ, పతంజలీ వంటి కంపెనీలు ధరలను తగ్గించగా.. తాజాగా మరిన్ని దిగ్గజ బ్రాండెడ్ ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సైతం వంటనూనెల రిటైల్ ధరలను తగ్గించాయి. ప్రస్తుతం.. అదానీ విల్మార్, ఇమామి, జెమినీ వంటి చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి.

అదానీ నూనెల తగ్గిన ధరలు..

అదానీ నూనెల తగ్గిన ధరలు..

ఈ సారి కంపెనీలు వంట నూనెలపై లీటరుకు రూ.15 నుంచి రూ.30 వరకు ధరను తగ్గించాయి. అదానీ గ్రూప్ కు చెందిన అదానీ విల్మర్ వివిధ రకాల వెజిటబుల్ ఆయిల్స్ రేట్ల తగ్గింపు ఇలా ఉంది..

* ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ 1లీటర్ పౌచ్ రూ.210 నుంచి రూ.199కి తగ్గింది.

* ఫార్చ్యూన్ మస్టర్డ్ ఆయిల్ 1లీటర్ బాటిల్ ధర రూ.210 నుంచి రూ.190కి తగ్గింది.

* ఫార్చ్యూన్ వేరుశెనగ నూనె 1లీటర్ ప్యాకెట్ ధర రూ.220 నుంచి రూ.210కి తగ్గింది.

* ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్ 1లీటర్ ప్యాకెట్ ధర రూ.225 నుంచి రూ.210కి తగ్గింది.

* రాగ్ వనస్పతి 1లీటర్ పౌచ్ ధర రూ.205 నుంచి రూ.185కి తగ్గింది. నెలాఖరు నాటికి పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని అదానీ విల్మార్ తెలిపింది.

భారీగా ధరలు తగ్గించిన ఇమామీ కంపెనీ..

భారీగా ధరలు తగ్గించిన ఇమామీ కంపెనీ..

ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరల్లో మార్పుకు అనుగుణంగా తమ ఉత్పత్తుల MRPలను తగ్గించినట్లు ఇమామీ సంస్థ పేర్కొంది. MRPని లీటరుకు రూ.35 వరకు తగ్గించడం ద్వారా కంపెనీ వినియోగదారులకు పెద్ద ఊరట కలిగిస్తోందని చెప్పుకోవాలి. వీటికి అనుగుణంగా డిస్ట్రిబ్యూటర్లకు ధరలు కూడా తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

* సోయా 1లీటర్ పౌచ్ పై రూ.35 తగ్గటంతో రూ.215 నుంచి రూ.180 చేరుకుంది.

* KGMO 1లీటర్ పౌచ్ పై రూ.17 తగ్గటంతో రూ.215 నుంచి రూ.198 అందుబాటులో ఉంది.

* RBO 1లీటర్ పౌచ్ ధర రూ.30 తగ్గటంతో రూ.220 నుంచి రూ.190కి చేరుకుంది.

జెమిని కూడా

జెమిని కూడా

ఎడిబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్ జెమిని కూడా తన ఉత్పత్తుల ధరలను తగ్గించింది. తగ్గించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* సన్‌ఫ్లవర్ 1లీటర్ పౌచ్ రూ.200 నుంచి రూ.192కి తగ్గింది.

* ఫ్రీడమ్ రైస్‌బ్రాన్ 1లీటర్ పౌచ్ ధర రూ.190 నుంచి రూ.175కి చేరుకుంది.

* వేరుశెనగ 1లీటర్ పౌచ్ ధర రూ.200 నుంచి రూ.185కి తగ్గింది.

* మస్టర్డ్ 1లీటర్ ప్యాకెట్ ధర రూ.215 నుంచి రూ.185కి చేరుకుంది.

* ఫస్ట్ క్లాస్ పామోలిన్ 1లీటర్ పౌచ్ ధర రూ.170 నుంచి రూ.150కి చేరుకుంది.

* ఫస్ట్ క్లాస్ లైట్ సూపరోలిన్ 1లీటర్ పౌచ్ రేటు రూ.180 నుంచి రూ.160కి తగ్గింది.

ధరల తగ్గుదల

ధరల తగ్గుదల

మోడీ నేచురల్ కూడా ఆలివ్ ఆయిల్ ధరను లీటరుకు రూ.15-20 తగ్గించింది. ఈ నెల ప్రారంభంలో దిగుమతి చేసుకున్న వంట నూనెల గరిష్ఠ రిటైల్ ధర ఒక వారంలోగా లీటరుకు రూ. 10 వరకు తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ తయారీదారులను ఆదేశించిందని ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించడంతో దేశీయ కంపెనీలు ధరల తగ్గింపు ప్రారంభంచాయి. గ్లోబల్ కమోడిటీ ధరల తగ్గుదల ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి మరిన్ని కంపెనీలు వంట నూనెల ధరలను ప్రస్తుతం కంటే లీటరకు రూ.15 వరకు తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary

Edible Oil: వినియోగదారులకు శుభవార్త.. భారీగా వంటనూనె ధరలు తగ్గించిన దిగ్గజ కంపెనీలు.. | leading edible oil companies reduces cooking oil prices know full details

leading edible oil companies from adani wilmer to freedom brand reduced cooking oil prices amid inflation big relief to commonman
Story first published: Sunday, July 17, 2022, 7:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X