For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వ్యాక్సీన్ కోసం ఆక్స్‌ఫర్డ్‌కు లక్ష్మీమిట్టల్ భారీ విరాళం

|

కరోనా వైరస్ వ్యాక్సీన్ పరిశోధన కోసం బిలియనీర్ స్టీల్ టైకూన్ లక్ష్మీమిట్టల్ భారీ విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి 3.5 మిలియన్ డాలర్ల మొత్తాన్ని గత వారం డొనేట్ చేశారు. మన కరెన్సీలో రూ.33 కోట్లకు పైగా. ఆక్స్‌ఫర్డ్‌లోని వ్యాక్సినాలజీ డిపార్టుమెంట్‌కు ఈ మొత్తం అందించారు. ప్రొఫెసర్ ఆడ్రియన్ హిల్ నేతృత్వంలోని జెన్నర్ ఇనిస్టిట్యూట్ కింద ఈ విభాగం పని చేస్తోంది. ఈ వ్యాక్సినాలజీ విభాగం ఇప్పుడు లక్ష్మీ మిట్టల్, ఫ్యామిలీ ప్రొఫెసర్షిప్ ఆఫ్ వ్యాక్సినాలజీగా పిలుస్తున్నారు.

గంటలో రూ.50,000 కోట్లు: ఇన్వెస్టర్ల పంట పండింది, రాకెట్‌లా ఇన్ఫోసిస్ షేర్గంటలో రూ.50,000 కోట్లు: ఇన్వెస్టర్ల పంట పండింది, రాకెట్‌లా ఇన్ఫోసిస్ షేర్

లక్ష్మీమిట్టల్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రపంచం మొత్తం మేల్కొనే సమయం ఆసన్నమైందని, భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధుల కోసం మనల్ని మనం సిద్ధం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. ఒక అంటువ్యాధి సామాజిక, ఆర్థికనష్టాన్ని ఎలా కలిగిస్తుందో మనమందరం అనుభవించామని, ఎల్లప్పుడూ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆసక్తి కలిగి ఉండాలన్నారు.

Laxmi Mittal supports COVID19 vaccine research at Oxford University

ప్రొఫెసర్ అడ్రియన్ హిల్‌తో సంభాషణ అనంతరం... హిల్, అతడి బృందం చేస్తున్న పని చాలా ముఖ్యమైందని నేను, నా కుటుంబం భావించి విరాళం అందించేందుకు ముందుకు వచ్చామని తెలిపారు. ప్రస్తుత సంక్షోభం కోసం మాత్రమే కాకుండా, భవిష్యత్తులోనూ మనం ఎదుర్కొనే సవాళ్ళ కోసం పని చేస్తామన్నారు. ప్రొఫెసర్ హిల్ టీం బాగా కష్టపడుతోందని, కరోనాతో పాటు భవిష్యత్తులో వచ్చే సవాళ్ల కోసం టీమ్ సమాధానాలు వెదుకుతోందన్నారు.

ప్రొఫెసర్ హిల్ తన కీలకమైన పరిశోధనలు కొనసాగించేందుకు ఈ డొనేషన్ ఎంతో ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ పేర్కొంది. అలాగే రాబోయే తరాల వ్యాక్సీన్ అభివృద్ధిలో ఆక్స్‌ఫర్డ్ ముందంజలో ఉండేలా చేస్తుందని పేర్కొంది.

English summary

కరోనా వ్యాక్సీన్ కోసం ఆక్స్‌ఫర్డ్‌కు లక్ష్మీమిట్టల్ భారీ విరాళం | Laxmi Mittal supports COVID19 vaccine research at Oxford University

The University of Oxford has received a donation of GBP 3.5 million last week to aid the development of a COVID-19 vaccine. Billionaire steel tycoon Mr Lakshmi Mittal made endowment for the post of professor of vaccinology in the Oxford Jenner Institute.
Story first published: Thursday, July 16, 2020, 20:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X